Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సింపుల్ గా మాయ చేస్తున్న కత్రినా

By:  Tupaki Desk   |   15 July 2019 12:55 PM GMT
ఫోటో స్టొరీ: సింపుల్ గా మాయ చేస్తున్న కత్రినా
X
కత్రినా టుర్కోట్ ఎవరు అని అడిగితే ఎంత పెద్ద సినిమా అభిమాని అయినా బిక్కమొహం వెయ్యాల్సిందే. అదే కత్రినా కైఫ్ అని అడిగితే టక్కుమని గుర్తుపడతారు. కత్రినా కైఫ్ అసలు పేరు కత్రినా టుర్కోట్. హాంకాంగ్ లో పుట్టిన బ్రిటిష్ భామ. అమ్మ బ్రిటన్ మహిళ.. నాన్న కాశ్మీర్ మూలాలున్న బ్రిటిష్ వాసి. దీంతో కత్రినా లుక్స్ పర్ఫెక్ట్ ఇంటర్నేషనల్ భామ లాగే ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న క్రేజీ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు.

కత్రినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. కత్రినా రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటుంది. కత్రినా చేసే పోస్టులే కాకుండా కత్రినావి ఇతర ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటాయి. రీసెంట్ గా అలాంటిదే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో కత్రినా వైట్ కలర్ టాప్.. వెయిట్ పోల్కా డాట్స్ ఉండే బ్లూ కలర్ మిడ్డీ ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఉంది. మెడలో సన్నటి చెయిన్.. స్టైలిష్ గా ఉన్న ఇయర్ రింగ్స్.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ కత్రినా అందాన్ని మరింతగా పెంచాయి. నాభి అందాలు కనపడీ కనపడకుండా కనువిందు చేస్తున్నాయి. ఫ్లాట్ గా ఉండే ఆమె యాబ్స్ చూస్తేనే ఎంత కఠినమైన ఎక్సర్ సైజులు చేస్తుందో.. డైట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలే ఈమధ్య రీబాక్ ఇండియా వారితో బ్రాండ్ అంబాజిడర్ గా డీల్ సైన్ చేసింది కాబట్టి జీరో సైజ్ ను జోరుగా మెయింటెయిన్ చేస్తోంది.

ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'సూర్యవంశీ' లో హీరోయిన్ గా నటిస్తోంది. వరసగా బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కిస్తున్న రోహిత్ శెట్టి పోలీస్ యాక్షన్ చిత్రానికి దర్శకుడు.