Begin typing your search above and press return to search.

ఆవిడ కొర‌కొర చూపులు

By:  Tupaki Desk   |   12 Dec 2018 4:55 AM GMT
ఆవిడ కొర‌కొర చూపులు
X
సుర సుర చూస్తూ రంపం కోత కోస్తోంది. కొర‌ కొర చూపుల‌తో కొంటె కుర్రాళ్ల గుండెల్ని గుల్ల చేస్తోంది. ఎవ‌రీ స‌ర‌య‌? అంటే.. ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌ర‌మే లేదు. ఈ చూపుల‌తోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించుకుంది. స‌ల్మాన్ భాయ్- ర‌ణ‌బీర్ క‌పూర్ అంత‌టి టాప్ స్టార్ల‌నే త‌న‌ వైపు తిప్పేసుకుంది. భాయ్‌ లే స‌లాం చేసే కిలాడీగా ఎదిగి ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు హీరోల‌కు ధీటుగా రాణిస్తూ బిలియ‌న్ డాల‌ర్ బాక్సాఫీస్ ప్ర‌పంచంలో త‌న హ‌వా సాగిస్తోంది.

నేటి త‌రం త‌న‌తో పోటీకి రాలేని స్థాయిలో త‌న‌ని తాను ఎలివేట్ చేసుకుంటూ- న‌ట‌న‌లో- అభిన‌యంలో రాటు దేలుతూ ఇంతింతై అన్న చందంగా ఎదిగిన క‌త్రిన అలియాస్ క్యాట్ 35 వ‌య‌సులోనూ హీట్ పెంచుతున్న వైనం అంద‌రిలో హాట్ టాపిక్. ఇటీవలే టైగ‌ర్ జిందా హై చిత్రంలో యాక్ష‌న్ క్వీన్‌ గా మెరిసింది. అంత‌లోనే థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రంలో `స‌ర‌య`గా మ‌రో విభిన్న‌మైన లుక్‌ తో మైమ‌రిపించింది.

ఇదొక్క‌టే కాదు.. కింగ్ ఖాన్ షారూక్ `జీరో` చిత్రంలో క‌త్రిన పాత్ర అంతే ప్రముఖ‌మైన‌ది. త‌న వెంట‌ప‌డే అమాయ‌క మ‌రుగుజ్జు షారూక్‌ కు జోల్ట్ ఇచ్చే రీల్‌ లైఫ్ క‌థానాయిక‌గా త‌న రియాలిటీ పాత్ర‌లోనే న‌టిస్తోంది. ఇటీవలే రిలీజైన టీజ‌ర్‌- పోస్ట‌ర్లు- సాంగ్ బిట్‌ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. తాజాగా `హుస్న్ ప‌ర‌చ‌మ్‌..` అంటూ సాగే పాట‌లో నాగినిలా చెల‌రేగిపోయింది క‌త్రిన‌. ఆ పాట‌లో క‌త్రిన లుక్ ఇది. ఇదిగో ఇలా బాత్ ట‌బ్‌ లో కిల్లింగ్ లుక్‌ తో క‌ట్టి ప‌డేస్తోంది. ఆ చుర‌చుర చూపుల‌కు కొవ్వొత్తులా కుర్ర‌కారు క‌రిగిపోవ‌డం ఖాయం అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.