Begin typing your search above and press return to search.

అవునా.. రజినీకాంత్ సరసన ఆమేనా?

By:  Tupaki Desk   |   29 Aug 2015 7:09 AM GMT
అవునా.. రజినీకాంత్ సరసన ఆమేనా?
X
రజినీకాంత్ ఏ సినిమా సంగతీ ఓ పట్టాన తేల్చరు. ఆయన సినిమా అఫీషియల్ గా మొదలవడానికి ముందు చాలా కథ నడుస్తుంది. కాంబినేషన్ల గురించి చాలా చర్చ జరుగుతుంది. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో చేయబోతున్న ‘కబాలి’ గురించి ఎంత డిస్కషన్ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు వినిపించాయో తెలిసిందే. దీని కంటే ముందు నుంచి ‘రోబో-2’ గురించి చర్చ జరుగుతోంది. అసలీ సినిమా ఉంటుందా లేదా అనే సంగతి తేలడానికే చాలా టైం పట్టింది. ఎట్టకేలకు శంకర్ రోబో-2 ఉంటుందని, అది రజినీతోనే అని హింట్ ఇవ్వడంతో సూపర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఐతే ఈ సినిమాకు దర్శకుడు శంకర్, హీరో రజినీ అన్నది తప్పితే ఇంకే విషయంలోనూ అభిమానులకు క్లారిటీ లేదు.

విలన్ గా విక్రమ్ నటిస్తాడన్నది ప్రచారమే. అందులో వాస్తవమెంతో తెలియదు. ఇక హీరోయిన్ గురించి కూడా చాలా చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. ఐశ్వర్యారాయ్ నే మళ్లీ నటింపజేస్తారని అనుకున్నారు కానీ.. ఇప్పటికే 40 ప్లస్ లో ఉన్న ఐసూని ఇంకో రెండు మూడేళ్ల తర్వాత జనాలు చూడ్డానికి ఏమాత్రం ఇష్టపడతారన్నది సందేహమే. అందుకే శంకర్ కళ్లు ఇప్పుడు మరో బాలీవుడ్ టాప్ స్టార్ కత్రినా కైఫ్ మీద పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన సినిమాను నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాలని ముందు నుంచి తాపత్రయ పడే శంకర్.. బాలీవుడ్ హీరోయిన్లను పెట్టుకోవడానికి ఇష్టపడతాడు. రోబో-2 విషయంలోనూ బాలీవుడ్ భామ కోసమే చూస్తున్నారాయన. ప్రస్తుతానికి ఆయన వెతుకులాట కత్రినా దగ్గర ఆగింది. తెలుగులో మల్లీశ్వరి సినిమా చేసిన కత్రినా.. మళ్లీ దక్షిణాది వైపు చూడలేదు. ఐతే ఎప్పట్నుంచో ఆమెను తమిళంలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోబో-2తో అది సాధ్యం కావచ్చని సమాచారం. ఎలాగూ బాలీవుడ్ లో కత్రిన జోరు తగ్గిన నేపథ్యంలో శంకర్ లాంటోడు అడిగితే కాదనే సమస్యే ఉండదు. కాకపోతే.. రజినీకి, కత్రినా జోడీ ఎలా ఉంటుందనేదే కొంచెం సందేహాలు రేకెత్తిస్తోంది. ఏమాత్రం మిస్ మ్యాచ్ ఉన్నా.. రజినీ మేకప్ తో సెట్ చేసేయగల టాలెంట్ శంకర్ కు ఉందిలే.