Begin typing your search above and press return to search.

కత్రినా యాబ్స్.. బాప్ రే అంత కష్టమా

By:  Tupaki Desk   |   30 July 2016 5:27 AM GMT
కత్రినా యాబ్స్.. బాప్ రే అంత కష్టమా
X
బార్ బార్ దేఖో మూవీలో కాలా చెష్మా సాంగ్ విడుదలైనప్పటి నుంచి కత్రినా కైఫ్ అందానికి డ్యాన్సింగ్ ట్యాలెంట్ కి చాలామంది ఫిదా అయిపోయారు. కత్తి లాంటి కత్రినా అన్ని యాంగిల్స్ లోను కుమ్మేసిందని అంటున్నారు. ఈ పాటలో కేట్ అంత పర్ఫెక్ట్ గా కనిపించడానికి.. ఆమె ఫిట్నెస్ ప్రధాన కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కత్రినా యాబ్స్ ఈ సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్.

ఇలాంటి ఫిజిక్ అందరికీ సాధ్యమయ్యేది కాదు. అయినా కేట్ సాధ్యం చేసిందంటోంది ఆమె ట్రైనర్ యాస్మిన్ కరాచివాలా. 'ఆ పాటలో కత్రినా యాబ్స్ అంత ఫిట్ గా, బ్యూటిఫిల్ గా కనిపించడానికి పైలేట్స్, కార్డియో ఎక్సర్ సైజులే కారణ. యాబ్స్, అబ్డామిన్ పై దృష్టి పెట్టి చాలా కాలంగా వర్కవుట్స్ చేస్తోంది. అలాగే తను ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్,. ఉదయం ఓట్ కేక్ - మధ్యాహ్నం ఫిష్ కూరగాయలతో లంచ్ - సాయంత్రం ప్రొటీన్ క్రషర్స్ - రాత్రి ఎగ్స్ సూప్.. ఇదీ తన డైట్ షెడ్యూల్.' అని చెప్పింది యాస్మిన్.

అటు ఫుడ్ విషయంలోను ఇటు వర్కవుట్స్ లోను స్ట్రిక్ట్ గా ఉండడంతోనే.. రోజురోజుకీ కత్రినా మరీ మెరిసిపోతోంది. ఇంకా తనలో చాలా అందాలు చూడచ్చని కేట్ హింట్ ఇస్తోందంటే.. ఇంకెన్ని చూపిస్తుందో కదా!