Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : ఎల్లో ఎల్లో డ‌ర్టీ ఫెలో!

By:  Tupaki Desk   |   14 Dec 2018 4:46 PM GMT
ఫోటో స్టోరీ : ఎల్లో ఎల్లో డ‌ర్టీ ఫెలో!
X
చంద‌న‌మే ప‌చ్చ‌ద‌న‌మే పచ్చిక బ‌య‌లు ప‌చ్చ‌ద‌న‌మే..! `చెలి` సినిమాలో ఈ రొమాంటిక్‌ గీతాన్ని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. ప‌చ్చిక బ‌య‌లు ప‌చ్చ‌ద‌న‌మే.. ఆ కురుల‌లో దాగిన సుగంధమూ ప‌చ్చ‌ని మెరుపే!! అంటూ వేటూరి సాహిత్యం మ‌న‌సుకు గిలిగింత‌లు పెడుతుంది. కానీ ఆ త‌ర్వాత అంత‌గా ప‌ర‌వ‌శించి మ‌న సినీక‌వులు అంత ఇదిగా రాసిందేం లేదు. బ‌హుశా షాలినిని చూసి క‌వి ఆనాడు అలా ఉప్పొంగి ఉండొచ్చు.

ఇదిగో ఇక్క‌డ మ‌ళ్లీ అలాంటి సందర్భ‌మే ఇది. అందాల క‌త్రిన కైఫ్ ప‌సుపు ప‌చ్చ డిజైన‌ర్‌ వేర్‌ లో మైమ‌రిపిస్తున్న తీరు కాళిదాసులో అయినా క‌విత‌లు పుట్టించేలా ఉంది మ‌రి. ప‌సుపు వ‌ర్ణంలో క్యాట్ త‌ళ‌త‌ళ‌లాడిపోతోంది. ఒక్క లుక్కు అలా ఇచ్చుకుంటే చాలు కుర్ర‌కారు గుండె గ‌ల్లంత‌వ్వాల్సిందే అన్నంత‌గా ఈ అమ్మ‌డు లుక్కిచ్చింది. ప‌సుపు డ్రెస్‌ లో మ‌తి చెద‌ర‌గొడుతోంది. ఈ డ్రెస్ త‌న‌కు ఎంతో ఇష్టం కూడా అని చెప్పింది.

ఎల్లో ఎల్లో డ‌ర్టీ ఫెలో! అంటూ కొత్త‌గా ఇంగ్లీష్ ప‌ద్యం పాడినా.. అస‌లు క‌త్రినను చూసి డ‌ర్టీ గాళ్ అని తీసిపారేయ‌గ‌లరా? `జీరో`(21 రిలీజ్‌) సినిమాలో ఈ భామ రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్‌ లో న‌టిస్తోంది. క‌థానాయిక‌ను ప్రేమించే మ‌రుగుజ్జుగా షారూక్ బోలెడంత ఎమోష‌న్ పండించ‌బోతున్నాడు. మ‌రుగుజ్జు ప్రేమ‌క‌థ‌లో ట్విస్టులు ఆ రేంజులోనే ఉండ‌నున్నాయి. అదంతా అటుంచితే క‌త్రిన ప్ర‌స్తుతం స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న `భ‌ర‌త్` అనే చిత్రంలో న‌టిస్తోంది. రెండు భారీ చిత్రాలు మునుముందు రిలీజ్‌ కి రాబోతున్న సంద‌ర్భంగా క‌త్రిన‌కు సంబంధించిన ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ ఫోటో - వీడియో యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.