Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రెడ్ హాట్ రచ్చహా!!

By:  Tupaki Desk   |   27 July 2017 12:47 PM GMT
ఫోటో స్టోరి: రెడ్ హాట్ రచ్చహా!!
X
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను తన కొంటె చేష్టలతో.. తన కొత్త కొత్త కవ్వింపులతో.. తన ఒంపుసొంపులతో కలిపి కలిపి కవ్విస్తున్న బ్యూటి ఎవరన్నా ఉన్నారాంటే.. ఖచ్చితంగా కత్రినా కైఫ్‌ పేరే ముందు చెప్పాలి. ఎందుకంటే అమ్మడు ఇలా ఫేసుబుక్కులోకి వచ్చిందో లేదో అలా కైపెక్కించడం మొదలెట్టింది. ఇలా ఇన్ స్టాగ్రామ్ లోకి దిగిందో అలా వయ్యారాలను దారబోయడం స్టార్ట్ చేసింది.

అదిగో ఇవాళ సడన్ గా ఎక్కడో లైబ్రరీలోంచి దుమ్ముదులిపి బయటకు తీసి ఒక ఫోటోను షేర్ చేసింది. ఇదేం మరీ అంత పాత ఫోటో కాదులే. ఈ మధ్యనే ఒక సాంగు కోసం కత్రినా టూపీస్ బికినీ వేసినప్పుడు తీసిన ఫోటో. కాకపోతే మరీ ఇంత ఫ్రాంటల్ యాంగిల్లో అమ్మడిని అలా ఎప్పుడూ మనం చూడలేదు. అందుకే అమ్మడు కూడా ఈ ఫోటోను షేర్ చేస్తూ.. నాకేం తెలీదు మీ పాట్లేదో మీరు పడండి అన్నట్లు ఎక్సప్రెషన్ ఇచ్చింది. ఇంత రెడ్ హాట్ గా అమ్మడు కనిపిస్తుంటే అసలు పిచ్చెత్తిపోతుంది అంతేగా మరి. అందుకే కత్రినా కూడా కామ్ గా షేర్ చేసేసింది.

ప్రస్తుతం టైగర్ జిందా హై అంటూ ఏక్తా టైగర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ షూటింగులో బిజీగా ఉన్న కత్రినా.. మధ్యలో బ్రేక్ తీసుకుని కొంటె కోణంగి వీడియోలే కాదు.. ఇలాంటి రెడ్ హాట్ వేషాలు కూడా వేసేస్తోంది. ఏదేమైనా కూడా రణబీర్ తో బ్రేకప్ అయ్యాక బాగా లిబరల్ గా మారిపోయిందండీ. ఏమంటారు?