Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కత్తిలాంటి అందాల వెన్నెల

By:  Tupaki Desk   |   22 Aug 2017 5:53 PM GMT
ఫోటో స్టోరి: కత్తిలాంటి అందాల వెన్నెల
X
మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్ లో మొదటి విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మ కత్రినా కైఫ్. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి మొదటి సినిమాతోనే బికినిలో కనిపించి తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఇక ఆ హిట్ తర్వాత ఈ అమ్మడు అస్సలు వెనక్కి చూడలేదు. కాకపోతే ఇక్కడ వదిలేసి బాలీవుడ్లో ఆమె జర్నీ స్టార్ట్ చేసింది.

బాలీవుడ్ కండల వీరుడైన సల్మాన్ ఖాన్ ని మాయలో పడేసి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎన్ని అపజయాలు వచ్చినా మూడు పదుల వయసు దాటినా ఇంకా తన అందాలకు పదును పెంచుతోంది. ఇప్పటివరకు చాలా సినిమాల్లో బికినీ తో అందాలను ఆరబోసింది. అయినా కూడా ఏ మాత్రం తగ్గేది లేదు అంటోంది. అయితే రీసెంట్ గా మరో బికినితో ఈ భామ కనిపించి తెగ హల్చల్ చేస్తోంది.. ముఖ్యంగా కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది కత్రినా. మొన్నమద్యన వోగ్ మ్యాగజైన్ కోసం దిగిన ఫోటో అంట.. చూస్తున్నారుగా ఎంత సెక్సీగా వలపులు దారబోస్తూ.. సముద్రపు ఒడ్డున కత్తిలాంటి వెన్నెలను కురిపిస్తోందో!!

ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ ఖాన్ త్రయం గా చెప్పుకునే సల్మాన్-షారుక్-అమీర్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే మరో ఇంగ్లీష్ సీరియల్ లో నటిస్తోందట. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్ర హాలీవుడ్ లో మెరుస్తోంది. మరి కత్రినా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.