Begin typing your search above and press return to search.

బ‌బితా కుమారి తాగుబోతు!

By:  Tupaki Desk   |   11 Dec 2018 4:23 AM GMT
బ‌బితా కుమారి తాగుబోతు!
X
`మ‌ళ్లీశ్వ‌రి` సినిమాలో క‌త్రినా కైఫ్ న‌ట‌న‌ - హావ‌భావాలు - డ్యాన్స్ చూసిన మ‌నోళ్లు అబ్బే మ్యాట‌ర్ ఏమీ లేదంటూ పెద‌వి విరిచేశారు. అందం త‌ప్ప న‌ట‌న రాదు.. డ్యాన్స్ అస‌లే రాదు అంటూ క‌త్రిన‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాలంతో పాటే మార్పు. ఇండ‌స్ట్రీకొచ్చాక నేర్చుకునే వారి జాబితాలో క‌త్రిన కూడా చేరిపోయింది. ఇటీవ‌ల ప‌లు చిత్రాల్లో క‌త్రిన‌ డ్యాన్సుల మెరుపులు చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటూ షాక‌వుతున్న విష‌యం తెలిసిందే. షీలాకీ జ‌వానీ..., చికినీ ఛ‌మేళి... మాషా అల్లా... ఇష్క్ షావా వంటి స్పెష‌ల్ గీతాల్లో క‌త్రినా కైఫ్ త‌న‌దైన స్టెప్పుల‌తో అద‌ర‌హో అనిపించింది.

రీసెంట్ గా విడుద‌లైన `థ‌గ్స్ ఆఫ్ ఇందుస్తాన్‌` చిత్రంలోనూ `సుర‌య్యా...` అంటూ అదిరిపోయే స్టెప్పులేసి మెస్మ‌రైజ్ చేసింది. ఈసారి మ‌ళ్లీ అదే త‌ర‌హాలో ఆడియ‌న్స్ మ‌తిపోగొట్ట‌నుంద‌ట‌. లేటెస్ట్ మూవీ `జీరో` క‌త్రిన కెరీర్‌ లో మ‌రో స్పెష‌ల్ మూవీ అన్న ప్ర‌చారం సాగుతోంది. షారూక్ ఈ చిత్రంలో హీరో. ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌కుడు. ప్ర‌యోగాత్మ‌క క‌థ‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క‌శ‌ర్మ న‌టిస్తోంది. క‌త్రిన రియ‌ల్ లైఫ్ పాత్ర‌లోనే అంటే సినిమా హీరోయిన్‌ గా క‌నిపించ‌నుంది. ఈ సినిమా లోని `హుస్న్ ప‌రిచ‌మ్‌...` అనే పాట‌లో క‌త్రినా కైప్ అదిరిపోయే స్టెప్పుల‌తో కుర్ర‌కారును మెస్మ‌రైజ్ చేయ‌బోతోందట.

ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌లై అంచ‌నాల్ని పెంచేసిన విష‌యం తెలిసిందే. బావ్‌ సింగ్ అనే మ‌రుగుజ్జు పాత్ర‌లో షారుఖ్ న‌టిస్తున్నాడు. అనుష్క శ‌ర్మ సైంటిస్ట్‌ గా న‌టిస్తుండ‌గా క‌త్రినా కైఫ్ మందుకు బానిసైన సినీ క‌థానాయిక బ‌బితా కుమారిగా క‌నిపించ‌నుంది. సినిమాలోని ఓ స‌న్నివేశం కోసం క‌త్రినాపై ఓ హాట్ రొమాంటిక్ పెప్పీ డ్యాన్స్ నంబ‌ర్‌ను ప్లాన్ చేశారు. ఈ పాట‌లో క‌త్రినా మ‌రింత హాట్‌ గా క‌నిపించి అల‌రించే బోతోంది. ఈ పాట‌కు సంబంధించి తాజాగా ఓ ఛ‌మ‌క్కు లాంటి వీడియోను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా క‌త్రినా అభిమానుల‌తో పంచుకుంది. `హుస్న్ ప‌రిచ‌మ్‌...` సాగే ఈ పెప్పీనంబ‌ర్‌ కు సంబంధించిన వీడియోను చిత్ర బృందం ఈ నెల 12న విడుద‌ల చేయ‌బోతోంది. ఈ పాట సినిమాపై మ‌రింత క్రేజ్‌ ని తీసుకొస్తుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.