కత్రినా కైఫ్ కెరీర్ కు సమాధే..

Fri Nov 09 2018 12:33:57 GMT+0530 (IST)

ఒక కథానాయిక 30 ఏళ్లు పైబడితే కెరీర్ ముగియడానికి కౌంట్ డౌన్ మొదలైనట్లే. హీరోయిన్ల కెరీర్ ప్రధానంగా గ్లామర్ మీదే ఆధారపడి ఉంటుంది. 30 ప్లస్ లో దాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదు. ఈ కారణంగా చాలామంది స్టార్ హీరోయిన్లు కనుమరుగైపోయారు. ఒకప్పుడు కుర్రాళ్లను ఒక ఊపు ఊపిన కత్రినా కైఫ్ కూడా ఈ బాటలోనే నడుస్తోంది. ‘టైగర్ జిందా హై’ మినహాయిస్తే గత కొన్నేళ్లలో కత్రినాకు హిట్టే లేదు. ఆ సినిమా హిట్ క్రెడిట్ కూడా సల్మాన్ ఖాతాలోకే వెళ్లింది. ఆ చిత్రం కత్రినాకు పెద్దగా పేరు తేలేదు. నటన విషయంలో కత్రినా ఎప్పుడూ వీకే. గ్లామరే ఆమె బలం. కానీ ఈ మధ్య అందులో ఆమె వీక్ అయిపోతోంది. ఇంతకుముందులా కత్రినా తన ఒంపుసొంపులతో  ఆకట్టుకోలేకపోతోంది. ఇలాంటి టైంలో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మీద చాలా ఆశలే పెట్టుకుంది ఈ ఎన్నారై బ్యూటీ.కానీ గురువారం రిలీజైన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చూశాక ఇక కత్రినా కెరీర్ ముగిసినట్లే అన్న కామెంట్లు పడుతున్నాయి. ఇందులో ఆమెది కరివేపాకు తరహా పాత్ర. కథలో ఆమెకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. ఒకటికి రెండు ఐటెం సాంగ్స్ తరహా పాటలు పెట్టారు. వాటిలో కత్రినా లుక్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. కొంచెం గట్టిగానే ఎక్స్ పోజింగ్ చేసింది కానీ.. అదేమంత కిక్కివ్వలేదు. కత్రినా డ్రెస్సింగ్.. స్టెప్పులు జుగుప్సాకరంగా ఉండటంతో జనాలు ఆమెను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆమె గ్లామర్ తో నెట్టుకురావడం కష్టమని తేలిపోయిందని.. ఇక సినిమాలు మానేస్తే బెటర్ అని కామెంట్లు పడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఆమిర్ ఖాన్.. అమితాబ్ బచ్చన్ సైతం ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. అందర్లోకి కత్రినాకే ఈ సినిమా ఎక్కువ చేటు చేసినట్లుంది.