Begin typing your search above and press return to search.

క‌త్రినాకు కోప‌మొచ్చింది!

By:  Tupaki Desk   |   26 Nov 2015 9:09 AM GMT
క‌త్రినాకు కోప‌మొచ్చింది!
X
కొంత మంది, కొన్ని సార్లు ఒక‌రి మీద ఉన్న కోపాన్ని మ‌రొక‌రి మీద ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అలాంటిదే ఈ మ‌ధ్య బాలీవుడ్ డాన్స్ మాస్ట‌ర్ బాస్కో ఎదుర్కొన్నాడ‌ట‌. క‌త్రినా కైఫ్‌ - సిద్ధార్థ్ మ‌ల్హోత్రా జంట‌గా రూపొందుతున్న చిత్రం బార్ బార్ దేఖో. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఒక పాట స్టూడియోలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌ లో జ‌రుగుతుంద‌ట‌. ఈ పాటకి మాస్ట‌ర్ బాస్కో కొరియోగ్ర‌ఫీ చేస్తున్నార‌ట‌. ఆ పాటలో కత్రినా - సిద్ధార్ధ్ - రామ్ కపూర్ - అన్నూ కసూర్ తదితరులు పాల్గొన్నారట. ఆ పాటకు బాస్కో సమకూర్చిన డాన్స్ మూమెంట్స్ అంత‌గా న‌చ్చ‌క‌పోవ‌డంతో పాట మ‌రేదో చిన్న పొర‌పాటు చేశాడ‌ట‌.

నిజానికి చెప్పాలంటే సినిమా షూటింగ్‌ లో చిన్న చిన్న పొర‌పాట్లు కామ‌న్. కానీ కత్రినా చిన్న దానికే నానా యాగి చేసింద‌ని స‌మాచారం. పెద్ద పెద్ద‌గా కేక‌లు వేయ‌డంతో డాన్స్ మాస్ట‌ర్ ఆమెను కూల్ చేయడానికి ప్ర‌య‌త్నించిన ఆమె ఆగ‌లేద‌ట‌. ఒక్క‌సారిగా లొకేష‌న్ లో అంద‌రూ సైలెంట్ అయిపోయార‌ట‌. కొంత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యార‌ట‌. క‌త్రినా చాలా కూల్ ప‌ర్స‌న్ ఎప్పుడూ ఇలా కోప‌డ‌లేదు. ఎందుకు ఆమె ఇంత ఇరిటేట్ గా ఫీల‌య్యిందో అని ఆమెతో రెగ్యుల‌ర్‌ గా ప‌ని చేసే వారంటున్నారు. మ‌రి కొంత మందేమో ఆ కోపానికి మ‌రో కార‌ణం ఉంది పాపం దానికి బాస్కో మాస్ట‌ర్ బ‌ల‌య్యాడు అని అంటున్నారు. ఇంతకీ క్రతినాకు ఎందుకం కోపం? అనే విష‌యం గురించి ఆరా తీస్తే తెలిసిన విష‌యం ఏమిటంటే...ఇటీవ‌ల తన ప్రియుడు రణబీర్ కపూర్ - దీపికా పదుకొనే జంటగా నటించిన 'తమాషా'కి కూడా బాస్కోనే స్టెప్స్ సమకూర్చాడు. అవి మ‌రీ బోల్డ్‌ గా ఉన్నాయ‌ట‌. దాంతో అప్ప‌టి నుంచి ఆ మాస్ట‌ర్ పై కోపంగా ఉంద‌ట‌. ర‌ణ‌బీర్ ని ఏమీ అన‌లేక ఇలా డాన్స్ మాస్ట‌ర్ పై ఫైరంయింటున్నారు ఆమె స‌న్నిహితులు!డాన్స్ మాస్ట‌ర్ హ‌ర్ట్ అయ్యాడ‌ని తెలుసుకున్న కత్రినా త‌న‌దైన శైలితో న‌వ్వుతూ ఏదో త‌మాషాకి అన్నట్టు క‌ప్పి పుచ్చుకునే ప్ర‌య‌త్నం చేసింద‌ట‌.