హీరోయిన్ అభిమాని సభ్యత మరిస్తే...

Thu Feb 22 2018 17:34:27 GMT+0530 (IST)

సోషల్ మీడియా వచ్చాక తాము చేసే వాటిని షేర్ చేసుకోకుండా ఉండటం సెలెబ్రిటీల వల్ల కావడం లేదు. తమ అభిమానులకు నేరుగా కలిసే అవకాశం ఉండదు కాబట్టి టెక్నాలజీ ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరు వాడుకుంటున్నారు. ఫాన్స్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి కూడా ఇది చక్కని ప్లాట్ ఫార్మ్ గా ఉపయోగపడుతోంది. దీని వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో ప్రతికూల ఫలితాలు కూడా అన్నే ఉన్నాయి. అందుకే ట్రాలింగ్ పేరుతో హీరో హీరొయిన్ల మీద అభ్యంతరకరమైన రీతిలో కామెంట్స్ చేసే వాళ్ళకు కూడా ఆన్ లైన్ లో కొదవ లేదు. కాకపోతే ఏదైనా హద్దుల్లో పరిమితుల్లో ఉంటే బాగుంటుంది కాని సదరు హీరో కాని హీరొయిన్ కాని మనసు నోచ్చుకునేలా కామెంట్ చేస్తే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది.బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ టైగర్ జిందా హై సక్సెస్ తర్వాత ప్రస్తుతం రెండు భారీ క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేస్తోంది. ఒకటి అమీర్ ఖాన్-అమితాబ్ మల్టీ స్టారర్ తగ్స్ అఫ్ హిందూస్తాన్ కాగా మరొకటి విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న షారుఖ్ ఖాన్ జీరో. ఈ సినిమాల కోసం రెస్ట్ లేకుండా షూటింగ్స్ లో ఉంటున్న కత్రినా కైఫ్ బాడీ ఫిట్నెస్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించడం లేదు. అందులో భాగంగా తను జిమ్ లో చేస్తున్న కఠినమైన ఎక్స్ సర్సైజులు చేస్తున్న ఫోటో వీడియో ఫాన్స్ తో షేర్ చేసుకుంది. అందులో మెసేజ్ పెడుతూ తప్పో ఒప్పో చేయటం గురించి కాదు ఇదంతా మనం చేయగలమా లేదా అనేదే ముఖ్యమన్న కత్రినా మనలో ఉన్న ఆత్మ విశ్వాసం లేదా భయం మనల్ని నిర్దేశిస్తుంది అనే అర్థం వచ్చేలా అందులో పోస్ట్ చేసింది.

మెజారిటీ ఫాన్స్ తన కమిట్మెంట్ పట్ల అభినందనలు కురిపించినప్పటికి కొందరు మాత్రం వెకిలిగా అసభ్యంగా కత్రినా చెప్పిన పాజిటివ్ ఎనర్జీ మెసేజ్ ని ఇంకో అర్థం తీస్తూ కామెంట్ చేయటం విమర్శలకు దారి తీస్తోంది. ఇలా జరగడం కొత్తేమి కాకపోయినా సదుద్దేశంతో పోస్ట్ పెట్టినప్పుడు ఇలా తేడాగా కామెంట్ చేయటం వల్ల వచ్చే ఆనందం ఏదో వారికైనా తెలుసో లేదో అంటున్నారు మిగిలిన ఫాన్స్. కాని కత్రినా ఇలాంటి వాటి మీద టైం వేస్ట్ చేసే ఉద్దేశంలో లేదు. తన జిం వీడియో కూడా పోస్ట్ చేసి తన పనుల్లో తాను బిజీ అయిపోయింది.