పవన్ 3 గంటలకు డ్రాప్ చేసిన అమ్మాయి ఎవరు?

Mon Jan 22 2018 06:00:30 GMT+0530 (IST)

కత్తి మహేష్ వివాదం ప్రస్తుతానికి సుఖాంతం అయ్యింది కాని ఎన్నో శేష ప్రశ్నల గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. టీవీ స్టూడియోలో దండలు మార్చుకుని - రాజీ చేసుకుని మంచి హంగామా చేసారు కాని అది క్షణాల్లో మర్చిపోవడానికి ఒక్క రోజులో జరిగిన సంఘటన కాదు. నాలుగు నెలలకు పైగా దేశంలో ఇంకే సమస్య లేదు - ఇది పరిష్కారం అయిపోతే అన్నింటికీ చెక్ పడుతుంది అనే లెవెల్ లో కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా చాలా బిల్డప్ ఇచ్చాయి. కాబట్టి మరికొద్ది రోజులు నెటిజెన్లు దీని గురించి డిబేట్లు చేసుకోవడం మానుకోరు. కత్తి మహేష్ ఇది జరుగుతున్నంత కాలం ఎన్ని స్టూడియోలకు ఎన్నెన్ని సార్లు వెళ్ళాడో లెక్క బెట్టడం కష్టం. అందులో గంటల తరబడి చర్చలు - వందల సంఖ్యలో ప్రశ్నలు - లెక్కలేనన్ని ఆర్గుమెంట్లు ఇలా చాలా చాలానే జరిగాయి. సరిగ్గా అందులో నుంచి ఒక కీలకమైన ప్రశ్నకు సమాధానం కావాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్లు. దీనికి కత్తి మహేష్ నేరుగా సమాధానం ఇచ్చే అవకాశం లేదు కాని పలురకాల ఊహాగానాలు మాత్రం మొదలయ్యాయి.ఒక సందర్భంలో కత్తి మహేష్ తన ప్రశ్నలను సంధిస్తూ పవన్ కళ్యాణ్ గతంలో తెల్లవారుఝామున 3 గంటలకు ఒక అమ్మాయిని డ్రాప్ చేయటం తనకు తెలుసని - తనెవరో సమయం వచ్చినప్పుడు బయట పెడతాను అని చెప్పిన సంగతి గుర్తుందిగా. సరిగ్గా అదే పాయింట్ ని డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్స్.ఈ తతంగం పలుమార్లు జరిగింది అని చెప్పిన మహేష్ తన పేరు ఇప్పటికైనా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పూనం కౌర్ విషయంలో స్లిప్ అయ్యి విమర్శలు అందుకున్న కత్తి మహేష్ దీని గురించి మళ్ళి ప్రతిస్పందించడం కష్టం కాని ఆమె ఎవరు అనే సస్పెన్స్ మాత్రం అలాగే కొనసాగనుంది.

కత్తి మహేష్ వీటికి జవాబు చెబుతాడో లేదో కాని వర్మ తీసిన జిఎస్టి కాన్సెప్ట్ ని సమర్ధించే క్రమంలో నాకు నచ్చిన ఏ అమ్మాయికైనా సెక్సువల్ గా ప్రపోజ్ చేసే హక్కుంది - తనకూ రిజెక్ట్ చేసే హక్కుంది అని చెప్పి విమర్శలకు బాగా అవకాశం ఇచ్చాడు. తను ఏ అర్థంతో చెప్పినా అది మాత్రం ఒకే అర్థంతో జనంలోకి వెళ్లిపోయింది. పవన్ ఫాన్స్ సైతం అదే పాయింట్ మీద రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేయటమే కాక కొందరు అమ్మాయిలతో మహేష్ మెసేజ్ చేసినట్టు చెబుతున్న కొన్ని స్క్రీన్ షాట్స్ షేర్ చేసుకోవడం వైరల్ గా మారుతున్న తరుణంలోనే దీనికి శుభం కార్డు పడింది. ఇవన్ని నిజాలు అనో లేక అబద్దాలు అనో చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ఆధారంగా చెప్పిన విషయాలే. ఇప్పటికైతే సద్దుమణిగింది కాని మళ్ళి మొదలైతే మాత్రం పవన్ మూడు గంటలకు డ్రాప్ చేసిన అమ్మాయి ఎవరు అనే సమాధానంతోనే మొదలు పెట్టాలని కోరుతున్నారు నెటిజెన్లు.