‘కాటమరాయుడు’ను కెలికింది ఎవరు?

Sun Mar 19 2017 22:51:52 GMT+0530 (IST)

మొన్న ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ రిలీజైనపుడు పవన్ ఫ్యాన్స్ పనిగట్టుకుని డిజ్ లైక్స్ కొట్టడం ఎంత పెద్ద చర్చకు దారితీసిందో తెలిసిందే. అసలు ఇండియాలోనే ఏ టీజర్ కూ లేని స్థాయిలో దీనికి డిజ్ లైక్స్ వచ్చాయి. ఈ విషయంలో అన్ని రికార్డుల్నీ తుడిచిపెట్టేసింది ‘డీజే’ టీజర్. మామూలుగా జనాలు ట్రైలర్ చూశాక లైక్స్.. డిజ్ లైక్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ట్రైలర్ నచ్చితే లైక్స్ కొట్టే అభిమానులు చాలామందే ఉంటారు కానీ.. డిజై లైక్స్ మీద దృష్టిపెట్టేవాళ్లు తక్కువమందే ఉంటారు. అలాంటిది ‘డీజే’ టీజర్ కు ‘లైక్స్’కు దీటుగా ‘డిజ్ లైక్స్’ వచ్చాయి.

అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు కాటమరాయుడు ట్రైలర్ కు కూడా డిజ్ లైక్స్ కొంచెం పెద్ద ఎత్తునే కనిపిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ‘కాటమరాయుడు’ ట్రైలర్ కు డిజ్ లైక్స్ కొట్డడానికి యాంటీ ఫ్యాన్స్ బాగానే ప్రయత్నం చేసినట్లున్నారు. ట్రైలర్ రిలీజైన కొన్ని నిమిషాల వరకు లైక్స్.. డిజ్ లైక్స్ సమానంగా కనిపించడం విశేషం. ఆ తర్వాత లైక్స్ పెరిగాయి. ప్రస్తుతం లైక్స్ 1.57 లక్షల మార్కుకు చేరువ అవుతుంటే.. డిజ్ లైక్స్ 45 వేల దాకా ఉండటం విశేషం. లైక్స్ తో పోలిస్తే డిజ్ లైక్స్ తక్కువే కానీ.. ఈ నంబర్ చిన్నదేమీ కాదు. పవన్ ట్రైలర్ కు 45 వేల డిజ్ లైక్స్ రావడం అంటే ఇది స్పెషల్ ఫోకస్ పెట్టి చేసిందే అని స్పష్టమవుతోంది.  ఇది బన్నీ అభిమానుల పనే అని అంటున్నారట . ఐతే డిజ్ లైక్స్ కొడితే ఎలాగూ బన్నీ అభిమానుల అకౌంట్లోకి చేరిపోతుంది కాబట్టి వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఈ పనిలో బిజీగా గడిపారని.. ఈ ట్రైలర్ కు వచ్చిన ప్రతి డిజ్ లైక్ బన్నీ ఫ్యాన్స్ ఖాతాలో వేసేయడం సరికాదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.