ట్రైలర్ టాక్: పవన్ ను రెచ్చగొట్టకండ్రా!

Sat Mar 18 2017 21:41:22 GMT+0530 (IST)

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు థియేట్రికల్ ట్రైలర్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. సరిగ్గా సినిమా రిలీజ్ కి ఇంకా కేవలం 6 రోజులు ఉందనగా.. హైద్రాబాద్ లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా.. థియేట్రికల్ ట్రైలర్ ను లాంఛ్ చేశారు.

ఆశించినట్లుగానే ముందుగా అనుకున్నట్లుగానే యాక్షన్ ఎపిసోడ్స్ తో కాటమరాయుడు ట్రైలర్ లో పుష్కలంగా ఉన్నాయి. అయితే.. అదే సమయంలో పవన్ నుంచి ఆశించే ఏ రకమైన ఎపిసోడ్స్ సినిమాలో మిస్ కాలేదని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అటు పవన్ స్టైల్ కామెడీ నుంచి.. ఇటు హీరోయిన్ తో రొమాన్స్ వరకూ.. పవర్ స్టార్ నుంచి ఆశించే ఏ రకమైన ఎపిసోడ్ సినిమాలో మిస్ కాలేదు. ఇక ఫైట్ల గురించి.. యాక్షన్ సీక్వెన్స్ ను గురించి చెప్పాలంటే మాటలు చాలవంతే.

డైలాగ్స్ విషయంలో కూడా పవన్ మార్క్ కనిపించింది. 'నన్ను రెచ్చగొట్టకండ్రా' అంటూ హెచ్చరించిన పవన్.. 'రేయ్ కోపాన్ని.. ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో' అంటూ ట్రైలర్ ను ఫినిష్ చేసిన తీరు అద్భుతం. పంచె కట్టులో పవన్ లుక్ ఈ మూవీకి హైలైట్ అయితే.. ఆలీ చేసిన కామెడీ సన్నివేశాలు.. సంథింగ్ స్పెషల్ గా ఉన్నాయి. మొత్తం మీద కాటమరాయుడు ట్రైలర్ అభిమానులకు ఉగాది పండుగను పది రోజుల ముందే తీసుకొచ్చేసింది.