Begin typing your search above and press return to search.

కాట‌మ‌రాయుడు టికెట్టా.. క‌ష్టం బాస్‌

By:  Tupaki Desk   |   21 March 2017 2:30 PM GMT
కాట‌మ‌రాయుడు టికెట్టా.. క‌ష్టం బాస్‌
X
అస‌లే రెండు నెల‌లుగా పెద్ద సినిమాలేవీ లేక ఆవురావురుమ‌ని ఉన్నారు జ‌నాలు. పైగా ఈ నెల‌లో అయితే ఓ మోస్త‌రు సినిమా కూడా ప‌డ‌క నీర‌సించిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ల‌కు ‘కాట‌మ‌రాయుడు’ లాంటి క్రేజీ మూవీ క‌నిపించేస‌రికి ఇక ఆగుతారు. సినిమాకు వెళ్తామో లేదో త‌ర్వాత ముందైతే టికెట్ బుక్ చేసి పారేద్దాం అన్న‌ట్లు బుక్ మై షో వెబ్ సైట్ మీద ప‌డిపోతున్నారు. దీంతో ఒక్కో థియేట‌ర్లో బుకింగ్స్ ఓపెన్ చేయ‌డం ఆల‌స్యం.. కాట‌మ‌రాయుడు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అంటూ గ్రే సీట్లు ద‌ర్శ‌న‌మిస్తుండ‌టంతో జ‌నాల‌కు నిరాశ త‌ప్ప‌ట్లేదు.

తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 90 శాతం థియేట‌ర్ల‌లో ‘కాట‌మ‌రాయుడు’ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్లు అంచ‌నా. హైద‌రాబాద్ లాంటి న‌గ‌రాల్లో 95 శాతం థియేట‌ర్ల‌కు బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. ‘కాట‌మ‌రాయుడు’ కోసం ఇబ్బ‌డిముబ్బ‌డిగా స్క్రీన్లు ఇచ్చినా స‌రే.. బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో లేవు. దాదాపుగా అన్ని థియేట‌ర్ల‌లో అన్ని షోల‌కూ టికెట్లు అయిపోయాయి. ఎక్క‌డో న‌గ‌ర శివార్ల‌లో కొన్ని చోట్ల మిన‌హాయిస్తే టికెట్లు అందుబాటులో లేవు. వీకెండ్ మొత్తానికి బుకింగ్స్ పూర్త‌యిపోయాయి. ఇంకా ఐమాక్స్ లాంటి కొన్ని థియేట‌ర్ల బుకింగ్స్ ఓపెన్ కాలేదు. వాటి కోసం కూడా జ‌నాలు ఆవురావురుమ‌ని ఉన్నారు. బుకింగ్స్ ఓపెన‌వ‌డం ఆల‌స్యం కొన్ని నిమిషాల‌న్నీ ఆ టికెట్లూ అయిపోవ‌డం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/