Begin typing your search above and press return to search.

కాటమరాయుడు.. మరో కబాలి!

By:  Tupaki Desk   |   28 March 2017 6:58 AM GMT
కాటమరాయుడు.. మరో కబాలి!
X
పోయినేడాది సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కబాలి’కి ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. దీనికి ముందు రజినీ సినిమా ‘లింగా’ ఫ్లాప్ అయినా సరే.. ఆ ప్రభావం ఏమీ ‘కబాలి’ మీద పడలేదు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కనీ వినీ ఎరుగని స్థాయిలో రిలీజైంది. ఫస్ట్ వీకెండ్ బుకింగ్స్ కూడా అదిరిపోయే రేంజిలో జరిగాయి. టికెట్ దొరకడం చాలా చాలా కష్టమైంది. తీరా చూస్తే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫస్ట్ వీకెండ్లో వసూళ్లకు ఢోకా లేకపోయింది. ముందే బుకింగ్స్ అయిపోవడంతో టాక్‌ తో సంబంధం లేకుండా తొలి వారాంతంలో భారీ వసూళ్లు వచ్చాయి. కానీ వీకెండ్ తర్వాత సినిమా దబేల్ మని కింద పడింది. వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి.

ఇప్పుడు ‘కాటమరాయుడు’ విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరుగుతోంది. పవన్ లాస్ట్ మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డిజాస్టర్ అయినప్పటికీ ఆ ప్రభావం ఏమీ ‘కాటమరాయుడు’పై పడలేదు. సినిమాకు మాంచి హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఫస్ట్ వీకెండ్ కు టికెట్లు దొరకడం కష్టమైంది. కానీ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయినా ఫస్ట వీకెండ్లో వసూళ్లకు ఢోకా లేకపోయింది. రూ.43 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది ‘కాటమరాయుడు’ తొలి మూడు రోజుల్లో. ఐతే వీకెండ్ అవ్వగానే వసూళ్లు ఒక్కసారిగా పడ్డాయి. సోమవారం ‘కాటమరాయుడు’ తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ డ్రాప్ చూస్తుంటే బయ్యర్లకు మరోసారి భారీ నష్టాలు తప్పేట్లు కనిపించట్లేదు. కాకపోతే బుధవారం ఉగాది సెలవు కావడంతో కొంచెం వసూళ్లు పుంజుకుంటాయేమో అని ఆశిస్తున్నారు. ఈ వీకెండ్లో రాబోయే సినిమాలకు ఎలాంటి టాక్ వస్తుందన్నదాన్ని బట్టి ‘కాటమరాయుడు’ నష్టాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది తేలుతుంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/