Begin typing your search above and press return to search.

టెన్షన్లో హైదరాబాదీ పవన్ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   23 March 2017 10:52 AM GMT
టెన్షన్లో హైదరాబాదీ పవన్ ఫ్యాన్స్
X
పొరుగు రాష్ట్రమైన బెంగళూరులో పదుల సంఖ్యలో ‘కాటమరాయడు’ బెనిఫిట్ షోలు పడుతున్నాయి. మరోవైపు తమిళనాడులోని చెన్నైలో సైతం పెద్ద ఎత్తున్న ఫ్యాన్స్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే చిన్న చిన్న టౌన్లు మొదలుకుని పెద్ద నగరాల వరకు అన్ని చోట్లా బెనిఫిట్ షోలు పడుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం బెనిఫిట్ షోల ఊసే వినిపించట్లేదు. మామూలుగా తెలంగాణలో ఒక్క హైదరాబాద్ లో మాత్రమే బెనిఫిట్ షోలు వేస్తుంటారు. ఐతే ఈ మధ్య కాలంలో వాటి మీద కూడా ఆంక్షలు పెడుతున్నారు. కొన్ని సినిమాలకు పర్మిషన్ ఇస్తున్నారు. కొన్నింటికి నో చెబుతున్నారు.

‘కాటమరాయుడు’ బెనిఫిట్ షోల విషయంలో అసలేమీ తేలట్లేదు. మూణ్నాలుగు రోజుల నుంచి బెనిఫిట్ షోల కోసం హైదరాబాదీ పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఒక్క షో కూడా కన్ఫమ్ కాలేదు. ఒక ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బుధవారం రాత్రి బెనిఫిట్ షోల వివరాలు త్వరలో అని ట్వీట్ చేసింది. కానీ ఇప్పటిదాకా అప్ డేట్ లేదు. సిటీలో పదికి పైగా బెనిఫిట్ షోలన్నారు కానీ.. ఇప్పటిదాకా ఏదీ కన్ఫమ్ కాలేదు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఇప్పటిదాకా ఒక్క చోట కూడా షో సంగతి తేలలేదు.

కూకట్ పల్లిలోని భ్రమరాంభ-మల్లికార్జున.. మూసాపేటలోని శ్రీరాములు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 35 ఎంఎం థియేటర్లలో బెనిఫిట్ షోలన్న టాక్ వినిపిస్తోంది. కాస్త పొద్దుపోయాక ఏమైనా క్లారిటీ రావచ్చేమో. కానీ మిగతా చోట్ల అర్ధరాత్రి నుంచే షోలు పడిపోతుంటే.. అసలిప్పటిదాకా షో సంగతే తెలియక హైదరాబాదీ పవన్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ అసలిక్కడ బెనిఫిట్ షోలు ఉంటాయా.. లేక ‘సరైనోడు’కు చివరి నిమిషంలో పర్మిషన్లు క్యాన్సిల్ చేసినట్లు దీనికి కూడా హ్యాండిస్తారా అన్నది చూడాలి మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/