Begin typing your search above and press return to search.

కాష్మోరా అర కోటి దాటిపోయింది

By:  Tupaki Desk   |   24 Oct 2016 4:21 AM GMT
కాష్మోరా అర కోటి దాటిపోయింది
X
కాష్మోరా.. ఈ బ్లాక్ మ్యాజిక్ ఫార్మాట్ అంటే జనాల్లో ఎంత భయం ఉంటుందో.. అంతకంటే ఎక్కువగా ఆసక్తి కనిపిస్తుంది. అందుకే ఇలాంటి వాటికి సంబంధించిన సినిమాలకు ఆదరణ ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా చిన్నా చితకా హీరోలే ఇలాంటి సబ్జెక్టులతో సినిమాలు చేస్తుంటారు. మూఢ నమ్మకాల జోలికి వెళ్లే ధైర్యం పెద్ద హీరోలు చేయరు. కానీ ఎప్పుడూ విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకునే కోలీవుడ్ హీరో కార్తి.. కాష్మోరా టైటిల్ పై ఓ సినిమాను ఈ దీపావళికి థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు.

అక్టోబర్ 28న తెలుగు తమిళ భాషల్లో కాష్మోరా గ్రాండ్ రిలీజ్ అవుతుండగా.. ఈ సినిమా తమిళ ట్రైలర్ ఓ అరుదైన రికార్డ్ అందుకుంది. అక్టోబర్ 7న విడుదల అయిన కాష్మోరా ట్రైలర్ ను.. ఇప్పటికి 50 లక్షలకు పైగా వ్యూస్ నమోదు అయ్యాయి. కార్తీ లాంటి మీడియం రేంజ్ హీరో సినిమాకి.. ఇది చాలా చాలా పెద్ద కౌంట్. అందుకే ఆడియన్స్ తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతగా కొత్త పోస్టర్ వేసి మరీ.. వ్యూస్ కౌంట్ ను డిస్ ప్లే చేశారు నిర్మాతలు. అక్టోబర్ 28న మరింత ఎగ్జైట్ అయేందుకు రెడీ కావాలంటూ ఊరిస్తున్నారు కూడా.

తెలుగులో అయితే మొత్తం దీపావళి రిలీజ్ లలో అత్యధికంగా బజ్ నెలకొన్న సినిమా కాష్మోరానే. తమిళ్ లో కోడి రూపంలో గట్టిపోటీ ఉంది కానీ.. తెలుగు వరకూ ఈ సారి దీపావళి పండుగకి కాష్మోరాకి పండగే అనే అంచనాలు ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/