డైరెక్టర్ సరే మరి హీరోకు

Sun Jul 15 2018 12:43:58 GMT+0530 (IST)

ఊహించిన దాని కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ  సక్సెస్ దక్కినప్పుడు వచ్చే కిక్కు గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆరెక్స్ 100 టీమ్ ఇప్పుడు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఓ మాదిరిగా అయినా ఆడుతుందా అనే అనుమానంతో విడుదలై అనూహ్య విజయం వైపు దూసుకుపోతున్న ఈ సినిమా వసూళ్లు ట్రేడ్ కి సైతం షాక్ ఇస్తున్నాయి. కంటెంట్ మీద కొన్ని కామెంట్స్ ఉన్నప్పటికీ పరిశ్రమలో విజయాన్ని నిర్దేశించేది వసూళ్లే కాబట్టి ఆ రకంగా ఆరెక్స్ 100 టీమ్ తమ గోల్ రీచ్ అయినట్టే. ఇకపోతే దాని ప్రభావమా అని ఇప్పుడు దానికి పనిచేసిన వారికి నటించిన వారికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దర్శకుడు అజయ్ భూపతికి ఏకంగా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి కథలు ఉన్నాయా అంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఆరెక్స్ 100 ప్రమోషన్ అయ్యాక వచ్చి కలుస్తానని చెప్పి అందరిని పెండింగ్ లో ఉంచేసాడని ఇండస్ట్రీ టాక్. అంతే మరి. బెల్లం చుట్టూ ఈగలు లాగా హిట్టు కొట్టిన వారి చుట్టూ నిర్మాతలు చేరటం సహజమే. అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ క్రేజీ బ్యానర్ లో ఉండబోతోంది అని ఇప్పటికే న్యూస్ గుప్పుమంటోంది.ఇక హీరో కార్తికేయ గుమ్మకొండ పరిస్థితి మాత్రం దీనికి కొంత భిన్నంగా ఉండటం అసలు ట్విస్ట్. నిజానికి ఇది అతని మొదటి సినిమా అని ప్రచారం చేస్తున్నారు కానీ గత ఏడాది ఋషి దర్శకత్వంలో ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమా ద్వారానే ఇతను పరిచయమయ్యాడు. మురళీశర్మ లాంటి పేరున్న ఆర్టిస్టులు అందులో నటించారు. కానీ అది వచ్చిందా లేదా అనే విషయం కూడా ఎవరికి తెలియకుండానే మాయమైపోయింది. ఆరెక్స్ 100 కార్తికేయకు రెండో సినిమా. మూడోదానికి ఆఫర్స్ వస్తున్నాయి కానీ కుర్రాడు మాత్రం పెద్ద సంస్థలు పేరున్న దర్శకుల కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నాడట. కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి కానీ అవి కార్తికేయకు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు అవకాశాలు ఇస్తాయా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. బోల్డ్ గా నెగటివ్ క్యారెక్టర్ చేయటం వల్ల పాయల్ కు  కమర్షియల్ గ్లామర్ రోల్స్ రావడం ఈజీ కాదు. కార్తికేయ చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ అది ఆశించిన  బడా ఆఫర్స్ తెస్తుందా అంటే ఇంకొంత కాలం ఆగితే క్లారిటీ వస్తుంది.