Begin typing your search above and press return to search.

అప్పుడే కమల్ తో పోలికేంటి కార్తీ

By:  Tupaki Desk   |   26 Oct 2016 9:30 AM GMT
అప్పుడే కమల్ తో పోలికేంటి కార్తీ
X
చాలామంది కొత్త కథతో డిఫరెంట్ పిక్చర్ చేస్తున్నామని చెబుతుంటారు. అవన్నీ ప్రచారం కోసం చెప్పే గాలి కబుర్లే అన్న సంగతి థియేటర్లలోకి ప్రేక్షకులు ప్రవేశించిన పది నిమిషాలకే అర్ధం అయిపోతూ ఉంటుంది. కానీ కోలీవుడ్ హీరో కార్తి మాత్రం ఇలాంటివేమీ చెప్పకుండానే విభిన్నమైన సబ్జెక్టులతో ప్రయోగాలు చేస్తుంటాడు. యుగానికొక్కడు లాంటి సినిమాని.. హీరో కేరక్టరైజేషన్ ను వేరే హీరోలయితే ఏం చేసేవాళ్లో కానీ.. కార్తీ మాత్రం కుమ్మేశాడు. ఊపిరి మూవీలో కార్తి రోల్ ను చేసేందుకు వేరే తెలుగు హీరోలెవరూ సాహసిచలేదు.

ఇప్పుడు కాష్మోరా అంటూ వస్తున్నాడు కార్తీ. 90 నిమిషాల పాటు విజువల్ ఎఫెక్ట్స్ ఉండే ఈ సినిమా.. కార్తీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆసక్తి కలిగిస్తోంది. ఈ గ్రాఫిక్స్ ను ఏకంగా 25 కంపెనీలతో చేయించడం విశేషం. ఇప్పుడు మూవీ ప్రమోషన్ లో భాగంగా.. తన పాత్రల గురించి చెప్పాడు కార్తీ. 'మగధీర తరహాలో సీన్స్ ఉంటాయి. వాటిలోనే రాజ్ నాయక్.. కాష్మోరా పాత్రలు వస్తాయి. వాటి మేకప్ కోసమే ఐదారు గంటలు కష్టపడాల్సి వచ్చేది. ఇవి కాకుండా మరో డిఫరెంట్ కేరక్టర్లో కనిపిస్తా. ఆ రోల్ చేసేటపుడు నాకు కమల్ హాసన్ గారు గుర్తొచ్చారు' అంటున్నాడు కార్తీ.

ఎంత డిఫరెంట్ సినిమాలు చేస్తే మాత్రం.. మరీ కమల్ హాసన్ తో పోలిక అంటే జనాలు నవ్వుతారు కార్తీ అనే సలహాలు ఇస్తున్నారు సినీ జనాలు. టార్గెట్ పెద్దదే కానీ.. ఆయన్ను రీచ్ అయ్యే ట్యాలెంట్ మా హీరోకి ఉందిలే అంటున్నారు ఫ్యాన్స్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/