రకుల్ ని బిజినెస్ మైండెడ్ అనేశాడు!

Sat Feb 09 2019 23:13:21 GMT+0530 (IST)

`స్పైడర్` ఫ్లాప్ తర్వాత రకుల్ కి సరైన ఆఫర్ లేదు. నాన్నకు ప్రేమతో - ధృవ చిత్రాలతో విజయాలు అందుకున్నా ఆ తర్వాత భారీ ప్రాజెక్టు ఏదీ దక్కలేదు. రీసెంట్ గానే `ఎన్టీఆర్ -కథానాయకుడు` చిత్రంలో శ్రీదేవి పాత్రలో తళుక్కుమంది. కానీ పూర్తి స్థాయి చిత్రంలో మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ - కోలీవుడ్ లో పలు భారీ చిత్రాల్లో నటిస్తోంది. కార్తీ - దేవ్ - సూర్య - ఎన్ జీకే చిత్రాల్లో  ఈ పంజాబీ బ్యూటీ నటిస్తోంది. ముందుగా దేవ్ చిత్రం రిలీజవుతోంది. ఈనెల 14న ప్రేమికుల రోజు కానుకగా దేవ్ రిలీజ్ కానుంది. ఇందులో రకుల్ ఓ ఇంట్రెస్టింగ్ రోల్ తో షాక్ ఇవ్వబోతోందిట. రకుల్ ఓ ఎన్నారై గా.. హెడ్ వెయిట్ ఉన్న మోడ్రన్ భామగా కనిపించబోతోందిట. పూర్తి బిజినెస్ మైండెడ్ అయిన ఈ అమ్మడితో దేవ్ ప్రేమలో పడ్డాక ఏం జరిగిందన్నదే సినిమా. శనివారం సాయంత్రం హైదరాబాద్ అన్న పూర్ణ స్టూడియోస్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో కార్తీ మాట్లాడుతూ రకుల్ కి సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ ని రివీల్ చేసేశాడు.`ఖాకీ` షూటింగ్ టైమ్ లో రకుల్ ని చూశాను. అప్పుడు వాయిస్ మెసేజ్ లు ఇస్తూ కనిపించింది. తనని చూడగానే  బిజినెస్ ఉమెన్ పాత్రకు సరిపోతుందనిపించింది. అదే దేవ్ దర్శకుడు లక్ష్మణ్ కి చెప్పాను.అలా ఆ చిత్రానికి రకుల్ ని ఎంపిక చేసుకున్నాం. దేవ్ కి డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు.. మేఘన (కథానాయిక) కు డబ్బు ఇంపార్టెంట్ .. ఇలాంటి  విరుద్ధమైన వ్యక్తులు ప్రేమించుకుంటే ఏం జరిగింది? అన్నదే సినిమా కథాంశం అని చెప్పాడు.

జనరేషన్ గ్యాప్ తో ప్రేమకథలు మారుతుంటాయి. ప్రస్తుత జనరేషన్ లోని ఓ ఛాలెంజింగ్ ప్రేమకథను తెరపై ఆవిష్కరిస్తున్నామని లక్ష్మణ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కార్తీ తెలిపారు. ఈ జనరేషన్ లవ్ స్టోరీస్ పూర్తిగా వేరు. పెళ్లి చేసుకోవడం - ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్ అన్నీ చాలా ఈజీ అయిపోయాయి. వాటన్నిటినీ తెరపై చూసుకునే ఛాన్స్ ఉంది.  చాలా స్టైలిష్డ్ గా సినిమాని తెరకెక్కించాం. కథ వినగానే బీఎండబ్ల్యూ బైక్ బుక్ చేశాం. కాస్ట్ లీ కార్స్  - రోల్స్ రాయిస్ .. అన్నీ బుక్ చేశాం. న్యూయార్క్ నుంచి వచ్చిన అమ్మాయి కూడా ఉంది.. అంటూ కార్తీ జోష్ తో కనిపించారు వేదికపై.