Begin typing your search above and press return to search.

హీరో గారి మీసం ఊడిపోయింది!!

By:  Tupaki Desk   |   27 Oct 2016 11:30 AM GMT
హీరో గారి మీసం ఊడిపోయింది!!
X
ఒకప్పుడు తెలుగు అండ్ తమిళంలో హీరోలు అంటే.. మీసం ఉండాల్సిందే. జుట్టు పెంచాల్సిందే. వాయిస్ లో బేస్ కూడా కావాలి. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్. మనిషి లుక్స్ నుండి వాయిస్ లో కిక్ వరకు ఎలా ఉన్నా కూడా హీరో కావొచ్చు. కాకపోత ఆ పాత కాలపు సినిమాలు మన మీద రుద్దేసిన ఓ కల్చర్ ను మాత్రం ఇంకా కొందరు హీరోలు తెగ పట్టించేసుకుంటున్నారు.

అదిగో మొన్న కాష్మోరా సినిమా ప్రమోషన్లలో భాగంగా తెలుగు మీడియాతో మాట్లాడాడు హీరో కార్తి. అయితే మనోడు హైదరాబాద్ వస్తున్నాం కాబట్టి బాగోదు అనుకున్నాడో ఏమో తెలియదు కాని.. తన క్లీన్ షేవ్ ముఖం మీద ఒక మీసం అంటించుకుని వచ్చాడు. ఇక మాట్లాడుతున్నంత సేపూ ఆ మీసం ఒక వైపును ఊడిపోతూ ఉంది. దానిని సరిచేసుకుంటే ప్రెస్ మీట్ అలాగే కొనసాగించాడు. అసలు ఇప్పుడు మీసం లేకపోతే ఏమవుతుంది కార్తీ? నార్త్ ఇండియాలో అయితే అసలు స్టార్ హీరోలు సినిమాల్లోనే మీసాలు పెట్టుకోవట్లేదు. సౌత్ లో కూడా కొన్ని తమిళ్ అండ్ మలయాళం సినిమాల్లో ఈ మీసాలకు ఇంపార్టెన్సే లేదు. ఈ పరిస్థితుల్లో ప్రెస్ మీట్ కోసం మీసం పెట్టుకుని రావల్సిన అవసరం ఏముంది? లైట్ తీసుకోవాల్సింది.

అనవసరంగా ఆ మీసం జారీపోవడం వలన ఇప్పుడు జోక్స్ వేసుకునే వారికి ఒక అవకాశం ఇచ్చినట్లయ్యింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో మారిపోయారు కార్తి.. యు డోంట్ నీడ్ ఫేక్ మీసం నానా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/