Begin typing your search above and press return to search.

రైతుగా మారతానంటున్న యంగ్ హీరో

By:  Tupaki Desk   |   30 Sep 2016 5:30 PM GMT
రైతుగా మారతానంటున్న యంగ్ హీరో
X
ఇమేజ్.. మాస్.. క్లాస్.. లాంటి వాటన్నిటినీ పక్కన పెట్టి సినిమా చేయగల వాళ్లు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. కెరీర్ మొత్తంలో ఒక డిఫరెంట్ ఎటెంప్ట్ చేసి.. తర్వాత తరంలో కూడా చెప్పేసుకునే బాపతు కూడా కనిపిస్తుంటారు. ఇక ఇప్పుడైతే ఇప్పుడే హీరోలుగా పుడుతున్న వాళ్లు కూడా మాస్ రచ్చ చేసేసి.. ఓవర్ నైట్ స్టార్ అయిపోదామని ప్రయత్నిస్తుంటారు. కానీ తమిళ హీరో కార్తి చేసిన సినిమాల్లో ఎక్కువగా ప్రయోగాలే ఉంటున్నాయంటే.. అన్న సూర్యని మించినోడు అనిపించక మానదు.

యుగానికొక్కడు లాంటి సినిమాని వేరే ఏ హీరో అయినా కచ్చితంగా చేయను పొమ్మనే వాడు. అలాంటి సినిమా కూడా చేసిన కార్తి.. ఇప్పుడు తన ఓ కోరికను బయటపెట్టాడు. 'నాకు అవకాశం వస్తే రైతు పాత్రలో నటించాలని ఉంది. వ్యవసాయం ఆధారంగా ఓ ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. తగినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటే.. ప్రజలందరూ వ్యవసాయం గురించి ఆలోచించే మూవీ చేయాలన్నది నా ఆలోచన. ఈ తరం యువత వ్యవసాయాన్ని ఎలా నిర్లక్షం చేస్తున్నారో చూపిద్దామని ఉంది. అందుకే రైతు పాత్ర అంటే ఇష్టం' అంటున్నాడు కార్తీ.

ఊపిరి లాంటి సినిమాలో తెలుగు హీరోలెవరూ ముందుకు రాకపోతే.. కార్తీ ఒక్కడే ధైర్యంగా చేయగలిగాడనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక ప్రస్తుతం కాష్మోరా అనే సినిమాని కార్తీ రిలీజ్ కి రెడీ చేస్తుండగా.. దీపావళికి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేస్తోంది.