కరిష్మా మాజీ భర్త కొత్త భార్య ఎవరంటే..

Thu Apr 20 2017 19:19:29 GMT+0530 (IST)

ఓ తరం వెనక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన భామ కరిష్మా కపూర్. రీసెంట్ గా వీరిద్దరి వివాహ ఎపిసోడ్ కి.. విడాకులతో తెరపడిపోయింది. కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ ఇప్పుడు మరో వివాహం కూడా చేసేసుకున్నాడు. ఇతనికి ఇది మూడో పెళ్లి కావడమే విశేషం.మొదట నందిత అనే మహిళను పెళ్లాడిన సంజయ్.. రెండో పెళ్లి రూపంలో కరిష్మాను పెళ్లాడాడు. అది కూడా ఇప్పుడు బ్రేకప్ అయిపోవడంతో.. విడాకులు అందుకున్న కొన్ని నెలలకే ప్రియా సచ్ దేవ్ అనే మోడల్ కం యాక్ట్రెస్ ను పెళ్లాడాడు సంజయ్. ఇతనికి ఇది మూడో పెళ్లి అయితే.. ప్రియా సచ్ దేవ్ కు ఇది రెండో పెళ్లి. గతంలో యూఎస్ బేస్డ్ హోట్లియర్ సంత్ చత్వాల్ ను పెళ్లి చేసుకున్న ప్రియా సచ్ దేవ్.. కొంతకాలానికే విడిపోయింది. ఇప్పుడు సంజయ్ కపూర్ ను ఢిల్లీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని.. న్యూయార్క్ లో అంతకంటే గ్రాండ్ గా పార్టీ ఇచ్చేసింది.

న్యూయార్క్ లోని ది నో మ్యాడ్ హోటల్ జరిగిన ఈ రిసెప్షన్ ను.. సంజయ్ - ప్రియల ఫ్యామిలీ మెంబర్స్.. ఫ్రెండ్స్.. సన్నిహితులు అందరూ హాజరయ్యారు. బాలీవుడ్ మూవీ నీల్ అండ్ నిక్కీతో ప్రియా సచ్ దేవ్ ప్రేక్షకులకు బాగా పరిచితమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/