అంబానీ దెబ్బకు ముంబై ఖాళీ

Sun Dec 09 2018 22:47:47 GMT+0530 (IST)

అంబానీ దెబ్బకు ముంబై ఖాళీ అయ్యింది. అసలు ముంబై వీధుల్లో .. బాంద్రాలో - పాళీ హిల్స్ ఏరియాలో అసలు సెలబ్రిటీలవెరూ కనిపించడం లేదు. ఇంతకీ వీళ్లంతా ఉన్నట్టుండి ఎందుకు అదృశ్యమయ్యారు? అసలేమైంది? అని ఆరాతీస్తే తెలిసిన సంగతి ఇదీ.ముంబైని ఖాళీ చేసిన సెలబ్రిటీలంతా నేరుగా ఉదయ్ పూర్ విమానాశ్రయంలో దిగి ఓ స్పెషల్ ప్లేస్ కి వెళ్లారు. అక్కడ ప్రపంచంలోనే రిచెస్ట్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ప్రీవెడ్డింగ్ వేడకలకు ఎటెండ్ అయ్యారు. ఇషా అంబానీ ది గ్రేట్ రియల్ ఎస్టేట్ టైకూన్ ఆనంద్ పిరమాళ్ ని పెళ్లాడుతోంది. ఈ సందర్భంగా బ్లెస్సింగ్స్ ఇచ్చేందుకు వెళ్లారు స్టార్లు అంతా. అసలింతకీ ఇందులో టాప్ సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారు? అంటే షారూక్ ఖాన్- సల్మాన్ ఖాన్- ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ - ఐశ్వర్యారాయ్- కత్రిన కైఫ్ - అమీర్ ఖాన్- వరుణ్ ధావన్- జాన్వీ కపూర్- కరిష్మా కపూర్- పరిణీతి చోప్రా- కరణ్ జోహార్ వంటి టాప్ సెలబ్స్ విచ్చేశారు.

ఆసక్తికరంగా ఈ గుంపులోనే యువకథానాయికలంతా చేరిపోయి నానా రచ్చ చేశారంటే నమ్మండి. అసలు చక్కనమ్మల చిలౌట్ చూస్తే గుండె గల్లంతవ్వాల్సిందే. ఈ గుంపులో జాన్వీ కపూర్- ఖుషీ కపూర్- రియా కపూర్ - పరిణీతి చోప్రా - కరిష్మా కపూర్ లాంటి నాయికలు ఉన్నారు. ఇదే చోట టాలీవుడ్ నుంచి.. బాహుబలి ప్రభాస్ సందడి చేసిన సంగతి తెలిసిందే.