Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అరిటాకులో వడ్డించిన పసుపు బికినీ

By:  Tupaki Desk   |   22 May 2019 4:57 PM GMT
ఫోటో స్టొరీ: అరిటాకులో వడ్డించిన పసుపు బికినీ
X
కరిష్మా శర్మ పేరు తెలుసా? ఈ అరిటాకు ఫోటో స్టొరీ చదివితే ఇకపై మర్చిపోరు లెండి. ఈ పాతికేళ్ళ ముంబై పాప యమా హాటు. హిందీలో పలు విజయవంతమైన టీవీ షోస్ లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. 'ఎంటీవీ వెబ్డ్'.. 'కామెడి సర్కస్' లాంటి చాలా టీవీ షోస్ లో పాల్గొంది. బాలీవుడ్ లో 'ప్యార్ కా పంచనామా 2' .. 'హోటల్ మిలన్' లాంటి సినిమాల్లో నటించింది. అయితే ఇవన్నీ కాదు పాపను పాపులర్ చేసింది.. ఎఎల్టీ బాలాజీ వారి 'రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్'. ఈ ఘాటు వెబ్ సీరీస్ లో రాగిణి పాత్ర పోషించి బూతు ప్రియులను.. యూతును చిత్తు చేసింది.

బ్యూటీ ఇంట్రో అయిపోయిందిగా.. ఇక ఈ కరిష్మా పేరుకు తగ్గట్టే సోషల్ మీడియాలో తన కరిష్మాను చూపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ మాల్దీవ్స్ లో వెకేషన్ లో ఉంది. ఇంకేముంది. అక్కడ నుంచి ఒక బికినీ ఫోటోను అలా ఇన్స్టా లో అలవోకగా పడేసింది. కళాపోషకులైన నెటిజనులు వెంటనే ఆ ఫోటోను కళ్ళకద్దుకున్నారు. అందం లేని వారికి.. అందాన్ని మేకప్పుతో అతికించుకునే వారికి లొకేషన్లు.. డ్రెస్సులు కావాలి కానీ అందం టన్నుల్లో ఉన్న భామకు ఏ డ్రెస్సు వేస్తె ఏం.. ఎక్కడ నిలబడితే ఏం?

సింపుల్ గా ఉండే పసుపు రంగు బికినీ ధరించి. ఒక అరటి చెట్టు దగ్గర.. ఆ చెట్టులో కలిసిపోయినట్టుగా.. అరిటాకుల్లో ఒక ఆకుగా నిలబడి ఒక సెక్సీ పోజు ఇచ్చింది. ఈ పోజు చూస్తే ఎలాంటి మహిళా విరోధి అయినా వెంటనే కరిష్మారాధకుడిగా మారిపోవడం ఖాయం. అసలు నవటాకు అందం కూడా కనిపించని అరిటాకుకు సేర్ల కొద్దీ అందం తీసుకురావడం కరిష్మాకే సాధ్యం!

ఈ ఫోటోకు కరిష్మా ఇచ్చిన క్యాప్షన్ "నేను నా మనసును వదిలించుకొని.. ఆత్మను కనుగొనేందుకు అడవిలోకి పోతున్నాను". అందమైన భామ అర్థం కాకుండా క్యాప్షన్ ఇచ్చినా నెటిజనులు పెద్దగా ఇబ్బంది పడలేదు. ఈ ఫోటోను పోస్ట్ చేసిన రెండు గంటల్లో లక్ష లైకులు కొట్టారు.. ఇక కామెంట్లకు లెక్కే లేదు. ఒకటి రెండు అయితే ఇక్కడ రాయగలం. అక్కడ వందలు ఉన్నాయి!