ఫోటో స్టోరీ : నయా స్విమ్ సూట్ నాగిని

Thu Aug 09 2018 12:33:42 GMT+0530 (IST)

నాగుపాముకి స్విమ్ సూట్ తొడిగితే ఎలా ఉంటుంది .. ఆలోచన చిలిపిగా ఉన్నా...  ఇదిగో ఈ అమ్మడిని చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది ఎవరికైనా. పూల్ సైడ్ నాగినిలా ఎలా బుసలు కొడుతోందో? అది కూడా టూపీస్ అల్ట్రా మోడ్రన్ ఫ్లోరల్ స్విమ్ సూట్ లో! కిక్కెక్కంచే మతిచెడే లుక్ లో వలపు దోపిడీ చేస్తోంది. ఈ నాగిని ఇంతకుముందు బుల్లితెర వీక్షకులకు బాగా సుపరిచితం. నాగిన్ సీరియల్‌తో నాగకన్యను తలపించింది. కోట్లాది మంది టీవీ వ్యూయర్ గుండెలు కొల్లగొట్టింది. ఇంతకీ ఎవరీ భామ అంటే పేరు కరిష్మా తన్నా.బోల్డ్ కరిష్మా పెద్ద తెరపైనా అంతే మైమరిపిస్తోంది. రీసెంటుగా రిలీజైన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `సంజూ`లోనూ ఓ కీలకపాత్రతో మైమరిపించింది. సంజూలో కనిపించింది కొద్దిసేపే అయినా విజువల్ గ్లింప్స్ తో మైమరిపించింది. లవర్ స్నేహితుడితో బెడ్ రూమ్ లో రొమాన్స్ చేసే ప్రేయసిగా కరిష్మా గుబులు పుట్టించింది. పింక్ హాట్ బికినీలో అమ్మడు మనసు జువ్వుమని లాగేస్తుంది.

ఆ హిట్టు పడగానే ఇదిగో ఈ రేంజులో రెచ్చిపోయింది. చెలరేగి కుర్రకారుకు కంటిపై కునుకుపట్టనీకుండా చేస్తోంది. ఈ భామ ఇదే తీరుగా దూసుకుపోతే మునుముందు ఇటు సౌత్ కూడా వెల్‌కం చెబుతుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం నాగిన్ కరిష్మా ఇన్ స్టాగ్రమ్ లో వేడెక్కించే ఫోటోలు - వీడియోలు గుబులు పుట్టిస్తున్నాయ్. వామ్మో! అని కంగారు పడిపోతారంతే!!