Begin typing your search above and press return to search.

ఫ్రాన్స్ తీరంలో.. బికినీ మెరుపులు

By:  Tupaki Desk   |   24 Jun 2017 5:55 AM GMT
ఫ్రాన్స్ తీరంలో.. బికినీ మెరుపులు
X
బాలీవుడ్ సెలబ్రిటీలు సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేయడం.. చాలా సాధారణమైన విషయం. ఇక్కడి ఎండలను తట్టుకోలేక సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లిపోయి.. సేదతీరి వస్తుంటారు. కానీ ఈ మధ్య సోషల్ మీడియా విస్తృతం అయిపోయాక.. అక్కడ తాము ఏమేం చెప్పేస్తున్నామో చెప్పేందుకు ఏ మాత్రం ఆలోచించడంలేదు అందాల భామలు.

బాలీవుడ్ లో గత తరం హీరోయిన్ కరిష్మా కపూర్ ఈ మధ్య కాలంలో వార్తల్లో బాగానే నానింది. ఆమె భర్త సంజయ్ కపూర్ తో విడాకుల వ్యవహారం కారణంగానే ఎక్కువగా ఈమె పేరు వినిపించింది. ఈ హడావిడి నుంచి పూర్తిగా కోలుకున్న ఈ సీనియర్ బ్యూటీ.. ప్రస్తుతం యూరోప్ అంతా చుట్టేస్తోంది. వెకేషన్ ఎంజాయ్మెంట్ లో భాగంగా మొదట లండన్ లో చక్కర్లు కొట్టిన ఈమె.. ఇప్పుడు ఫ్రాన్స్ చేరుకుంది. వరుసగా అక్కడి నుంచి అప్ డేట్స్ ఇస్తున్న కరిష్మా కపూర్.. ఇప్పుడు ఫ్రెంచ్ రివియెరా నుంచి పోస్ట్ చేసిన బికినీ పిక్ సెన్సేషన్ అవుతోంది. టూపీస్ బికినీ ధరించి నడుం ఒంపులు .. క్లీవేజ్ సొగసులు చూపిస్తున్న ఈ సీనియర్ సుందరిని చూసి జనాలు షాక్ తినేశారు.

42 ఏళ్ల వయసులో కూడా కరిష్మా కపూర్ అందాలు ఈ స్థాయిలో మెరిసిపోతోందంటే.. ఈ భామ తన ఫిట్నెస్ పై ఎంతగా ప్రాధాన్యం ఇస్తుందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా యోగ డే పిక్ లో తన ఫిట్నెస్ సీక్రెట్ ని చెప్పకనే చెప్పింది కరిష్మా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/