Begin typing your search above and press return to search.

సన్నీ లియోన్.. మనోభావాలు దెబ్బ తీసింది

By:  Tupaki Desk   |   15 July 2018 9:51 AM GMT
సన్నీ లియోన్.. మనోభావాలు దెబ్బ తీసింది
X
సన్నీ లియోన్ ఇప్పటికే చాలాసార్లు చాలామంది మనోభావాలు దెబ్బ తీసింది. పోర్న్ సినిమాల నుంచి వచ్చి ట్రెడిషనల్ గా ఉండే భారతీయుల మధ్యకు వచ్చి ఇక్కడ సినిమాలు చేశాక ఇలాంటివి సహజమే. కాబట్టి ఆమె ఇక్కడ ఎంత వ్యతిరేకత ఎదురైనా పట్టించుకోలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకుంది. ఐతే ఇప్పుడు ఆమె మరోసారి మనోభావాలు దెబ్బ తీసిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈసారి ఆమె ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకతే ఎదుర్కొంటోంది. దీనికి కారణం సన్నీ జీవిత కథతో తెరకెక్కిన ‘కరణ్ జీత్ కౌర్’ వెబ్ సిరీసే. దీని టైటిల్లో ‘కౌర్’ అనే పదం ఉండటం పట్ల పంజాబ్ కు చెందిన శిరోమణి గురు ద్వారా పర్బందక్ కమిటీ (ఎస్జీపీసీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

పంజాబ్ సిక్కు మహిళలు పేరు పక్కన ‘కౌర్’ పెట్టుకుంటారు. దీన్ని గౌరవ సూచకంగా భావిస్తారు. ఇది తమ మతంగా చాలా పవిత్రమైన.. గౌరవమైన పదం అని.. ఈ పదాన్ని సన్నీ లియోన్ లాంటి శృంగార తార జీవిత కథతో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ కు పెట్టుకోవడం ఆక్షేపణీయమని ఎస్జీపీసీ నాయకులు అంటున్నారు. సన్నీ పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయే. ఐతే ఆమె కుటుంబం ఎప్పుడో ఇండియాను విడిచిపెట్టి విదేశాల్లో స్థిరపడింది. ఆమె అసలు పేరు కరణ్ జీత్ కౌర్. అందుకే వెబ్ సిరీస్ కు ఆ పేరు పెట్టారు. కానీ సన్నీ ఎప్పుడూ సిక్కు మతం సంప్రదాయాల్ని పాటించలేదని.. సిక్కు గురువుల ఆదేశాల్ని పాటించలేదని.. అలాంటపుడు ‘కౌర్’ అనే పదాన్ని తన పేరులో పెట్టుకోవడం.. సినిమాకు కూడా దాన్ని జోడించడం సరి కాదని.. వెంటనే ఆ వెబ్ సిరీస్ పేరు నుంచి ‘కౌర్’ను తొలగించకపోతే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు సిక్కు నేతలు. మరి దీనిపై సన్నీ ఏమంటుందో చూడాలి.