Begin typing your search above and press return to search.

మమ్మీ నా? కాదు అమ్మాయే

By:  Tupaki Desk   |   27 July 2017 5:59 AM GMT
మమ్మీ నా? కాదు అమ్మాయే
X
హీరోయిన్ అంటే జీరో సైజ్ ఉండాలి అనే ఒక మార్క్ ను సెట్ చేసి ఎన్ని అందాలు వచ్చినా ఎంత మంది కొత్తవారు వచ్చినా ఇప్పటికే తానే నంబర్ వన్ అనే తరమాలో తన సత్తాచాటుతుంది కరీనా కపూర్ ఖాన్. పెళ్లి తరువాత కొన్ని సినిమాలు చేసినా.. అవి ఏవి అంత హిట్ కాకపోవడంతో కరీనా తన ఫ్యామిలిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కరీనా అమ్మ కూడా అయ్యింది. తను అమ్మ అవ్వబోతుంది అనే వార్త అప్పటిలో బాలీవుడ్ కి పెద్ద షాక్. ఎందుకంటే అలాంటి ఫిట్ అండ్ బ్యూటీకి మనం దూరం అయిపోతున్నమే అని తెగ బెంగ పెట్టుకుంది బాలీవుడ్. కానీ అందరి అంచనాలు తారు మారు చేస్తూ గర్భంతో ఉన్నప్పుడూ కూడా తన అందం ఏ మాత్రం తగ్గకుండా కాపాడుకొంది కరీనా.

అమ్మ అయిన తరువాత కరీనా కొంచెం బొద్దుగా మారినా.. అందరికీ తెలిసిన ఆ మార్పు ఎంతో కాలం ఉండలేదు. మళ్ళీ మునుపటి హీరోయిన్ లా మారిన కరీనాను చూస్తే ఈమె ఇప్పుడు 'మమ్మీ నా? కాదే!! అప్పటి కరీనా కపూరే!!' అని అనుకొక మానరు. కాలం మాత్రమే మారింది నేను కాదని చెప్పకపనే చెబుతోంది ఈ భామ. పిల్లాడు పుట్టి ఇంకా ఎన్నో నెలలు కాలేదు అప్పుడే కరీనా అమ్మ నుండి అమ్మాయిలా మారిపోయింది. ఈ మధ్య ఫిల్మ్ ఫేర్ కోసం ఒక ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ లో కరీనా ను చూడండి మీకే అర్ధం అవుతుంది. తన కొడుకు తైమూర్ పుట్టినప్పటి నుండి షూటింగ్ లకు దూరంగా ఉన్న కరీనా ఇప్పుడు వెయిట్ తగ్గి స్లిమ్ గా మారి ఇలా దర్శనం ఇచ్చింది.

కరీనా కపూర్ ఖాన్ ఇప్పుడు వీర్ దీ వెడ్డింగ్ సినిమాలో మళ్ళీ తన అందాలను తెర పై ప్రదర్శించబోతుంది. ఇప్పుడు ఇప్పుడే స్టార్లు అయిన వారందరికి కరీనా కపూరే ఆదర్శం అని చెబుతూ ఉంటారు. 'హీరోయిన్' సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ అంటే కరీనా కపూరే అన్నంతగా ముద్రవేసింది. మొత్తానికి కొంచెం టైమ్ గ్యాప్ తో మళ్ళీ అప్పటి చమేలీ లా కనిపించి అందరిని షాక్ కు గురి చేస్తోందిలే.