Begin typing your search above and press return to search.

ఎందుకంతగా ఊరిస్తున్నావ్ కరీనా

By:  Tupaki Desk   |   25 April 2018 11:09 AM GMT
ఎందుకంతగా ఊరిస్తున్నావ్ కరీనా
X
బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఇప్పటికీ అందాల మెరుపులు కురిపిస్తూనే ఉంది. పెళ్లయి.. ఓ పిల్లాడిని కన్న తరువాత కూడా ఓ రేంజ్ అందాలతో మెరిసిపోతోంది కరీనా కపూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ తను నటించిన లేటెస్ట్ మూవీ ప్రచార పనుల్లో బిజీగా ఉంది. వీరే దీ వెడ్డింగ్ పేరుతో ఓ చిత్రాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించగా.. కరీనా ప్రెగ్నెన్సీ కారణంగా ఈ చిత్రం కొంత ఆలస్యం అయింది.

సోనమ్ కపూర్.. స్వర భాస్కర్ లు కూడా నటించిన ఈ చిత్రం జూన్ 1న విడుదల చేయనున్నారు. ఇప్పుడీ మూవీకి ట్రైలర్ లాంఛ్ సందర్భంగా తన అందాలను కురిపిస్తూ అటెండ్ అయింది కరీనా కపూర్ ఖాన్. బ్లూకలర్ ప్యాండ్ సూట్ లో వచ్చిన ఈ బ్యూటీ.. క్రాప్ బ్రా టాప్ ను ధరించి.. చూపరులను తెగ ఆకట్టుకుంది. క్లీవేజ్ షో విషయంలో తన స్టైల్ ను ప్రదర్శించడమే కాదు.. ఈ సెగ్మెంట్ లో తన సీనియారిటీ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించింది. ఎంతైనా ఈ విషయంలో ఈమెకు ఉన్న అనుభవాన్ని రంగరించి మరీ అందాల ప్రదర్శించింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నలుగురు అమ్మాయిల జీవితమే ఈ సినిమా.

కానీ రొటీన్ కి భిన్నంగా.. ఈతరం కుర్రకారు బైట ఎలా మాట్లాడుకుంటారో.. ఎంత స్వేచ్ఛగా నోటినుంచి బూతులు దొర్లించేస్తూ ఉంటారో.. అన్నిటినీ పలికించేశారు. ఈ నలుగురిలో ఒకరికి పెళ్లి సెట్ కావడం.. ఆ తర్వాత వచ్చిన విబేధాలు.. మళ్లీ ఈ నలుగురు అమ్మాయిలు ఎలా ఆ విషయాన్ని డీల్ చేశారన్నదే మూవీ. ఒక్కసారి ట్రైలర్ చూస్తే మాత్రం.. కచ్చితంగా చూడాలని అనిపించే విధంగా వీరే దీ వెడ్డింగ్ ట్రైలర్ కట్ చేయడం విశేషం.