Begin typing your search above and press return to search.

పాత ప్రియుడికి పాప పుడితే..

By:  Tupaki Desk   |   31 Aug 2016 3:30 PM GMT
పాత ప్రియుడికి పాప పుడితే..
X
బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కి ఇప్పుడు స్టార్ హీరో ఇమేజ్ ఉంది కానీ.. అసలు ఇతగాడు ఇండస్ట్రీలోకి వచ్చినదే కరీనా కపూర్ కి లవర్ ఇమేజ్ తో అనే విషయం చాలా మందికి తెలుసు. జబ్ వియ్ మెట్ తో కుర్రాడికి హిట్ ఇచ్చిన తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమాలు బాగా తగ్గాయ్ కానీ.. అప్పటివరకూ అతగాడిని నిలబెట్టేందుకు వరుసగా సినిమాలు చేసింది బాలీవుడ్ భామ బెబో.

ఎవరికి వారు స్టార్స్ గా ఎదిగిపోయాక కరీనా- షాహిద్ ల మధ్య విబేధాలు వచ్చేశాయి. తర్వాత ఎవరికి వారు సెటిల్ అయిపోయారు. సైఫ్ ఆలీ ఖాన్ ని పెళ్లి చేసుకుని కరీనా కపూర్ ఖాన్ గా బెబో మారిపోతే.. మీరా రాజ్‌ పుత్‌ ని షాహిద్ వివాహమాడాడు. ఇప్పుడు షాహిద్- మీరాల జంటకు ఓ పాప పుట్టింది. షాహిద్‌ భార్య మీరా శుక్రవారం నాడు పండంటి ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో బాలీవుడ్‌ ప్రముఖులు.. అభిమానులు బోలెడన్ని అభినందనలతో ముంచెత్తేస్తున్నారు. అయితే.. షాహిద్ జంటకు పాప పుట్టిందని తెలిసిన వెంటనే.. కరీనా నుంచి కంగ్రాట్స్ అనే మెసేజ్ వెళ్లిందని తెలుస్తోంది.

ప్రస్తుతం కరీనా కపూర్ ఖాన్ కూడా ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసు కదా. డిసెంబర్ లో ఈ భామ అమ్మ కాబోతోంది. ఇదిలా ఉంటే.. సైఫ్-షాహిద్ లు కూడా మంచి ఫ్రెండ్స్.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రంగూన్ లో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.