Begin typing your search above and press return to search.

క‌రీనా ఫొటో మార్ఫింగ్‌.. తీవ్ర వివాదం

By:  Tupaki Desk   |   19 Nov 2017 11:25 AM GMT
క‌రీనా ఫొటో మార్ఫింగ్‌.. తీవ్ర వివాదం
X
క‌రీనా క‌పూర్. బాలీవుడ్‌ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న క‌థాన‌య‌కి! వివాదాల‌కు సుదూరంగా ఉండే ఈ భామ తాజాగా పెను వివాదంలో చిక్కుకుంది. అది కూడా ల‌వ్ జీహాద్ వ్య‌వ‌హారంలో కూరుకుపోయింది. అయితే, ఈ వివాదంలో ఆమె ప్ర‌మేయం ఇసుమంతైనా లేదు! కొన్ని హిందూ ఆర్గ‌నైజేష‌న్స్‌కు చెందిన అత్యుత్సాహ ప‌రులు చేసిన ప‌నితో.. క‌రీనా వివాదంలో చిక్కుకు పోవ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. రాజస్థాన్‌ లో లవ్‌ జిహాద్‌ కు వ్యతిరేకంగా హిందు స్పిర్చువాలిటీ అండ్‌ సర్వీస్‌ ఫౌండేషన్‌ (హెచ్‌ ఎస్‌ ఎస్‌ ఎఫ్‌) అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా విద్యా సంస్థ‌ల‌ను ఈ సంస్థ టార్గెట్ చేసుకుని అక్క‌డ ప్ర‌చారం ప్రారంభించింది.

ఈ కార్యక్రమంలో విద్యార్థుల‌కు అవ‌గాహ‌న కోసం అంటూ విడుదల చేసిన బాలీవుడ్ న‌టి కరీనా కపూర్‌ ఖాన్‌ ఫొటో అత్యంత వివాదాస్పదంగా మారింది. కరీనా ఫొటోను, బుర‌ఖా వేసుకున్న మరో మహిళ ఫొటోతో మార్ఫింగ్‌ చేసి.. ``లవ్‌ జిహాద్‌ వలలో చిక్కుకుంటే.. మీరు ఇలా అవుతారు`` అంటూ విద్యార్థులకు హెచ్‌ ఎస్‌ ఎస్‌ ఎఫ్‌ కార్యకర్తలు బోధిస్తున్నారు. ఈ కరపత్రాన్ని హెచ్‌ ఎస్‌ ఎస్‌ ఎఫ్‌ బహిరంగ ప్రదేశాల్లో పంపిణీ చేస్తోంది. ముస్లిం - క్రైస్తవ మతాలు చేస్తున్న మతమార్పిడి మోసాలను విద్యార్థులకు తెలియచెప్పేందుకే ఇలా చేస్తున్నట్లు సంస్థ అధికారులు పేర్కొంటున్నారు.

రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో హెచ్‌ ఎస్‌ ఎస్‌ ఎఫ్‌ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక పెంపెందించే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ అవగాహన కార్యక్రమాల్లో రాజస్థాన్‌ లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులంతా హాజరు కావాలని అక్కడి రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ అవగాహనా కార్యక్రమాల్లో హిందూ జీవన విధానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని హెచ్‌ ఎస్‌ ఎస్‌ ఎఫ్‌ బోధించనుంది. ఏదైనా కార్య‌క్ర‌మంపై ప్ర‌చారం చేసుకునేందుకు అనేక మాధ్య‌మాలు, మ‌నుషులు ఉన్నారు. అయితే, వీరు చేస్తున్న ప్ర‌చారం ల‌వ్ జీహాద్‌లో చిక్కుకోరాద‌ని, కానీ వీరు వినియోగించిన న‌టి.. ముస్లిం సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌. మ‌రి దీనిని ఎలా స‌మ‌ర్ధించుకుంటారో వారికే తెలియాలి. ప్ర‌స్తుతం దీనిపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.