Begin typing your search above and press return to search.

ఈ ప్రేమ పిచ్చి పీక్స్ కు చేరినట్లుందే

By:  Tupaki Desk   |   20 Feb 2017 7:54 AM GMT
ఈ ప్రేమ పిచ్చి పీక్స్ కు చేరినట్లుందే
X
ఓ స్టార్ హీరో.. మరో స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోవడం లాంటి సెలబ్రిటీ మ్యారేజ్ లు మన దగ్గర తక్కువే. కానీ బాలీవుడ్ లో ఇలాంటి కహానీలు బోలెడు. వీటిలో ఒకటి సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ ల కథ. రీసెంట్ గా ఈ జంటకు ఓ బాబు పుట్టగా.. అతనికి తామ్ మూర్ అలీ ఖాన్ పటౌడీ అనే పేరు పెట్టుకున్నారు.

సైఫ్ అలీ ఖాన్ నటించిన మూవీ రంగూన్.. ఈ నెల 24 న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీ జనాలు.. సన్నిహితుల కోసం ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్ కు కరీనా కపూర్ కూడా హాజరైంది. ప్రస్తుతం ఈమె 2నెలల బాలింత అనే విషయం తెలిసిందే. అయినా సరే.. భర్త నటించిన మూవీ కోసం థియేటర్ కు వచ్చేసింది బెబో. అంతే కాదు.. రంగూన్ పోస్టర్ల పక్కన నుంచుని ఫోటోలకు పోజులు ఇచ్చింది. పనిలో పనిగా.. పోస్టర్ లో సైఫ్ మొహంపై ఆప్యాయంగా చెయ్యి వేసి.. తన ప్రేమను మరింతగా చాటుకుంది కరీనా కపూర్.

సైఫ్-కరీనాల మధ్య ప్రేమ చాలా ఉందని అందరికీ తెలుసుకానీ.. ఈ రేంజ్ లో అని మాత్రం ఇప్పుడే జనాలకు అర్ధం అయింది. వీళ్లిద్దరి మధ్య ప్రేమపిచ్చి పీక్స్ కి చేరిపోయిందని సరదాగా కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/