Begin typing your search above and press return to search.

ముద్దులో పద్ధతి మార్చిన బెబో

By:  Tupaki Desk   |   14 Feb 2016 7:18 AM GMT
ముద్దులో పద్ధతి మార్చిన బెబో
X
కొన్నేళ్ల క్రితం వరకూ కరీనా కపూర్ చాలా గ్లామరస్ లుక్స్ తో కనిపించేది. ఇండియన్ స్క్రీన్ పై ఇంతగా అందాలు ఒలకబోయచ్చని చూపించింది కూడా. లిప్ కిస్సులు- బికినీలతో తెగ హంగామా చేసేసేది. కానీ సైఫ్ ఆలీ ఖాన్ తో పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయింది. గ్లామర్ చూపిస్తున్నా.. అది ఓవర్ ఎక్స్ పోజింగ్ కాదు. అంతే కాదు ముద్దుసీన్లు ఉండకూడదని ముందే కండిషన్ పెట్టేది. ఇప్పుడు మాత్రం ఈ పద్ధతి మార్చేసింది బెబో.

ఆర్ బల్కి తెరకెక్కిస్తున్న కి అండ్ కా చిత్రంపై బాలీవుడ్ లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. లడకీ అండ్ లడకాకి షార్ట్ ఫామ్ కి అండ్ కా. ఇందులో అర్జున్ కపూర్ - కరీనా కపూర్ లు జంటగా నటించారు. ఇప్పుడీ మూవీకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. టేబుల్ కి చెరో వైపు నుంచుని, ముందుకు ఒంగి పెదవులను ఆనించారు అర్జున్ - కరీనాలు. ఒక్క పోస్టర్ తో తను గీసుకున్న బోర్డర్ చెరిపేసుకున్నట్లు చెప్పేసింది కరీనా కపూర్.

'నా మొదటి ముద్దు పోస్టర్ ఇదే అనుకుంటా. ఇదేమీ పెద్ద విషయం అనుకోవడం లేదు. అసాధారణ జంటగా కనిపించబోతున్న మేం ముద్దు పెట్టుకోకపోతే ఎలా' అని క్వశ్చన్ చేసింది కరీనా. ఇలా అడగడానికి రీజన్ ఉంది. మొగుడు ఉద్యోగం - పెళ్లాం ఇల్లు.. ఈ కాన్సెప్ట్ కి రివర్స్ వెళుతూ పెళ్లాం ఉద్యోగం చేస్తే, మొగుడు ఇల్లు చూసుకుంటే ఎలా ఉంటుంది అన్నదే కి అండ్ కా సినిమా.