Begin typing your search above and press return to search.

వర్కవుట్ మహిమ.. పిచ్చ హాట్!!

By:  Tupaki Desk   |   20 July 2017 5:33 PM GMT
వర్కవుట్ మహిమ.. పిచ్చ హాట్!!
X
బాలీవుడ్ లో హీరోయిన్ దశాబ్ద కాలానికి పైగా కరీనా కపూర్ టాప్ ప్లేస్ లో కొనసాగింది. హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకుని రీసెంట్ గా ఓ తైమూర్ కు జన్మనిచ్చింది. కొడుకు ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ కొద్దికాలంగా షూటింగులకు దూరంగా ఉంటోంది. లాస్ట్ ఇయర్ ఉడ్తా పంజాబ్ కి అండ్ క సినిమాల్లో కరీనా కనిపించింది. ఆ రెండూ సోసో గానే ఆడాయి. ఈ ఏడాది ఇంతవరకు ఆమె నటించిన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు.

కొడుకు కొంచెం పెద్దవాడు అవడంతో కరీనా తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది. సాధారణంగా డెలివరీ తర్వాత బాడీలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ప్రగ్నన్సీ ఫిట్ నెస్ పై ప్రభావం చూపుతుంది. తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చేసరికి పాత బెబోని చూపించడానికి గట్టిగానే వర్కవుట్లు చేస్తోంది. రీసెంట్ గా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు చూస్తుంటే.. ఆ వర్కవుట్ మహిమ బాగానే ఉందనిపిప్తోంది. ఆమె పిల్ల తల్లి అంటే ఏ మాత్రం నమ్మబుద్ధి కాదు. యంగ్ హీరోయిన్లకు పోటీ ఇవ్వగలిగేలా స్లిమ్ అండ్ గ్లామరస్ లుక్ లో కనిపించింది. ఆమెను చూసిన వారంతా ఇప్పుడు మరింత హాట్ గా కనిపిస్తుందటూ కితాబు ఇచ్చేస్తున్నారు.

ప్రస్తుతం కరీనా కపూర్ బాంబే సమురాయ్ - వీర్ దే వెడ్డింగ్ సినిమాల్లో నటిస్తోంది. ఇవి ఈ ఇయర్ ఎండింగ్ కు థియేటర్లకు వచ్చే అవకాశముంది. అక్షయ్ ఖన్నా - ఫరాన్ అక్తర్ లు ప్రధాన పాత్రధారులుగా బాంబే సమురాయ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కరీనాతో పాటు డయానీ పెంటీ కల్కి కొచ్లిన్ సైతం నటిస్తున్నారు. దీంతో పాటు శశాంక్ ఘోష్ డైరెక్షన్ లో రానున్న వీర్ దే వెడ్డింగ్ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది.