Begin typing your search above and press return to search.

టీష‌ర్ట్ నెక్లెస్ .. ఇదీ లేటెస్ట్‌ ట్రెండ్‌!

By:  Tupaki Desk   |   16 Aug 2018 4:48 PM GMT
టీష‌ర్ట్ నెక్లెస్ .. ఇదీ లేటెస్ట్‌ ట్రెండ్‌!
X
చ‌క్క‌న‌మ్మ ఏం చేసినా చ‌క్క‌ద‌న‌మే. చూడ‌గానే ఛ‌మ్కీ తినిపించేందుకు ఏదో ఒక‌టి చేయాలి. లేదంటే ఈ రోజుల్లో యూత్ వెంట‌ప‌డేది ఎలా? 40కి ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా.. 20లోనే ఉన్నామ‌ని ఊరిస్తూ ఉడికిస్తూ జ‌నాల‌కు చ‌క్కిలిగింత‌లు పెడితేనే గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో క్రేజు నిల‌బ‌డుతుంది. అందుకు బ్రాండ్ అంబాసిడ‌ర్ లాంటిది బెబో అలియాస్ క‌రీనాక‌పూర్‌. సైఫ్‌ని పెళ్లాడి తైమూర్‌కి త‌ల్లి అయినా.. ఇంకా టీనేజీ అమ్మాయిలా త‌న‌ని తాను అలంక‌రించుకుని డిస్‌ప్లేకి పెట్ట‌డం త‌న‌కు మాత్ర‌మే చెల్లింది.

ఇటీవ‌లి కాలంలో బోబో ఎక్క‌డికి వెళ్లినా త‌న వెంట అక్క క‌రిష్మా క‌పూర్ కూడా ద‌ర్శ‌న‌మిస్తోంది. ఆ ఇద్ద‌రూ క‌లిసే డిన్న‌ర్లు, పార్టీల‌కు ఎటెండ్ అవుతూ అక్క‌డ సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ అవుతున్నారు. జ‌స్ట్ కాలేజ్ నుంచి మొన్న‌నే రిలీవ్ అయ్యి డిగ్రీ స‌ర్టిఫికెట్ కోసం ఎదురు చూస్తున్న అక్క‌జెళ్లెల్ల మాదిరి ఈ భామ‌ల య‌వ్వారం చూస్తుంటే కుర్రాళ్లంతా క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారు.

ఇదిగో ఇక్క‌డ టైట్‌ఫిట్ టీస్.. బాట‌మ్‌లో బ్లూ డెనిమ్‌..లో క‌రీనా ఫోజు చూస్తేనే అర్థం కావాలి. ఎరుపు తెలుపు చార‌ల టీష‌ర్ట్ చూడ‌గానే ఎట్రాక్టివ్‌ గా క‌నిపిస్తోంది. అంత‌కుమించి దానిపై డిజైన్ అదిరిపోయింది. ఆ టీష‌ర్ట్‌కి నెక్లెస్ లాంటిది ఒక‌టి డిజైన్ చేసి ఆక‌ర్ష‌ణ పెంచారు. ఇన్నాళ్లు బంగారు ఆభ‌ర‌ణాలు మెడ‌లో ధ‌రించ‌డం చూసిన జ‌నాల‌కు ఇక టీష‌ర్టుల‌కు నెక్లెస్ తొడ‌గొచ్చ‌న్న ఐడియాని కూడా ఇచ్చింది ఈ డిజైన్. దానిపై కోకో కోలా బ్రాండ్ ప్ర‌మోష‌న్ అదిరిపోయింది. ఇంత‌కీ ఈ టీష‌ర్ట్ ఖ‌రీదు ఎంతో తెలుసా? జ‌స్ట్ రూ.20 వేల రూపాయ‌లు మాత్ర‌మే. మునుముందు ఫ్యాష‌న్ ఐక‌న్ క‌రీనా ఇంకెన్ని ర‌కాల డిజైన్స్‌ని యూత్‌కి ప‌రిచ‌యం చేస్తుందో చూడాలి.