Begin typing your search above and press return to search.

కడుపులోని బిడ్డకు పేరు పెట్టిన స్టార్ కపుల్!

By:  Tupaki Desk   |   27 Sep 2016 9:44 AM GMT
కడుపులోని బిడ్డకు పేరు పెట్టిన స్టార్ కపుల్!
X
కడుపులో ఉన్న బిడ్డ ఆడా, మగా అని అడిగితే తప్పు కానీ.. పుట్టకముందే పేరు పెట్టుకుంటే తప్పుకాదు కదా అని ఆలోచించారో లేక ట్రెండ్ అనుకున్నారో కానీ సైఫ్ ఆలీఖాన్ - కరీనా కపూర్ లు ఇదే కార్యక్రమానికి తెరలేపారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న కరీనా కపూర్ డిసెంబర్ లో బిడ్డకు జన్మ ఇవ్వనుంది. అయితే ఈ లోపే సైఫ్, కరీనాలు తమకు పుట్టబోయే బిడ్డకు ముందుగానే పేరు నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయంలో వీరు బాలీవుడ్ జంట షాహిద్ కపూర్, మీరా రాజ్ పుట్ బాటలో నడుస్తున్నారో ఏమో మరి!

షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్.. ఇటీవల ఓ ఆడబిడ్డకు జన్మనివ్వడం, ఇద్దరి పేర్లూ కలసి వచ్చేలా ఇద్దరి పేర్లలోని మొదటి అక్షరాలను కలపి పాపకు "మిషా" అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే లాజిక్ తో సైఫ్, కరీనాలు ఇద్దరి పేర్లు కలసి వచ్చేలా కడుపులోని బిడ్డకు "సైఫీనా" అనే పేరు పెట్టాలని భావిస్తున్నారు. ఈ పేరును సైఫ్ ఎంపిక చేసినట్టు కరీనా వెల్లడించింది. అయితే సైఫ్ - కరీనా డేటింగ్ లో ఉన్న టైం లో అభిమానులు, మీడియా వారిని సైఫీనాగా సంబోదించేవారు. ఇదే బాగుందనుకున్నారో ఏమో కానీ.. తమ ప్రేమకు గుర్తుగా పుట్టబోయే బిడ్డకు ఈ పేరే పెట్టాలని సైఫ్ భావిస్తున్నాడు. ఈ పేరు కరీనాకు కూడా బాగా నచ్చినట్టు సమాచారం.

ఈ ఆలోచన సైఫ్ కి వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ.. ఇప్పటికే షాహిద్ చేసిన ఇదే ఆలోచన కరీనా చేసి ఉంటే మాత్రం గాసిప్ రాయుళ్లు తమ పెన్నులకు తెగ పనిచెప్పేసేవారేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/