Begin typing your search above and press return to search.

భారీగా ఉన్నా బెబో అందాల కొండ

By:  Tupaki Desk   |   29 Sep 2016 3:30 PM GMT
భారీగా ఉన్నా బెబో అందాల కొండ
X
సహజంగా సీనియర్లు అయిపోయిన సినిమా హీరోయిన్లు బరువు పెరగడంలో పెద్ద వింతేమీ లేదు. కానీ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ విషయంలో అలా జరగలేదు. సినిమా సినిమాకి చిక్కిపోతూ.. చివరకు జీరో సైజ్ అందాలను దేశానికి.. ఇక్కడి కుర్రాళ్లకు పరిచయం చేసింది బెబో. ఆ తర్వాత చాలా మంది బక్కచిక్కిన భామలు ఇలా కనిపించినా.. అంత నిండైన విగ్రహం జీరో సైజ్ చేసినోళ్లు ఒకళ్లు కూడా లేరు.

ఇదంతా కొంచెం వెనక జరిగిన కథ. ఇప్పుడు బెబో బాగా లావైపోయింది. ఎంత భారీగా పెరిగిపోయిందో ఈ ఫోటో చూస్తే అర్థమవుతూనే ఉంది. ఇదంతా అమ్మడిని నెలలు నిండడం కారణంగా అనే విషయం ఇప్పటికే తెలిసిపోయింది. డిసెంబర్ లో తమకు బిడ్డ పుట్టనున్నట్లు సైఫ్-కరీనాలు ఇప్పటికే చెప్పేశారు కాబట్టి.. ప్రస్తుతం కరీనాకు ఏడు నెలలు నిండాయన్న మాట. మరి ఎనిమిదో నెల గర్భవతి అంటే ఈ మాత్రం లావవడం పెద్ద విషయమేం కాదు కానీ.. ఆ సైజులో కూడా... మోకాళ్లకు జానెడు పై వరకూ కట్ ఉన్న డ్రస్ వేసుకుని బయట తిరగడం అంటే మాత్రం కచ్చితంగా చెప్పుకోవాల్సి విషయమే.

తను కడుపుతో ఉన్నంత మాత్రనా తన లైఫ్ లో పెద్దగా వచ్చేసే మార్పులేవీ ఉండవని గతంలో చెప్పిన కరీనా.. ఇప్పుడదే చేసి చూపించేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/