Begin typing your search above and press return to search.

100కోట్ల మహారాణి అర్థాంతరంగా ఇలా..

By:  Tupaki Desk   |   28 July 2015 6:03 AM GMT
100కోట్ల మహారాణి అర్థాంతరంగా ఇలా..
X
100కోట్లు, 200కోట్లు.. 500 కోట్లు వసూలు చేసే సినిమాలెన్నో బాలీవుడ్‌ లో రిలీజవుతున్నాయి. వీటన్నిటిలో కామన్‌ గా కనిపించే కథానాయిక బెబో. అందుకే రెండు దశాబ్ధాలుగా తిరుగులేని నాయికగా బాలీవుడ్‌ ని ఏల్తోంది కరీన. తనకంటూ ఇప్పటికీ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కేవలం స్టార్‌ హీరోల సరసన నటిస్తూ.. ఆయా హీరోలకు లక్కీ మస్కట్‌ అన్న పేరు కూడా తెచ్చుకుంది.

సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగన్‌, షారూక్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ లాంటి స్టార్ల సరసన నాయికగా నటించే ఈ భామ వాళ్లందరి విజయాల్లో నేను భాగస్వామిని అయినందుకు చాలా గర్వంగా ఉందని అంటుంది. అయితే అంత క్రేజు ఉన్న ఈ భామ ఈ క్షణం చాలా కొత్తగా ప్రవర్తిస్తోంది. జాతీయ అవార్డు దర్శకుడు ఆర్‌.బాల్కీ దర్శకత్వంలో ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో నటిస్తోంది. త్వరలో సెట్స్‌ కెళ్లనున్న ఈ సినిమా కోసం బెబో ప్రత్యేక కసరత్తు చేస్తోంది. బెబో ఈ క్యారెక్టర్‌ గురించి మాట్లాడుతూ.. నా కెరీర్‌ లో ఇంతవరకూ చేయని క్యారెక్టర్‌ ఇది. ఓ కార్పొరెట్‌ కంపెనీని శాసించే టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ పాత్రలో నటిస్తున్నా. మా ఆయన (అర్జున్‌ కపూర్‌) ఇంట్లోనే ఉంటాడు. ఫ్యామిలీ మొత్తాన్ని నడిపించే అమ్మాయిగా నటిస్తున్నా.

నా కెరీర్‌ లోనే ఇలాంటి పాత్రలో మునుపెన్నడూ నటించలేదు. అందుకే ఈ క్యారెక్టర్‌ కోసం ప్రతిరోజూ 3గంటల పాటు ప్రిపేర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికే సైఫ్‌ కి కూడా ఈ మాట చెప్పాను.. అని చెప్పింది బెబో. అంటే రోజూ 3గంటల పాటు ప్రత్యేక సాధన కోసం కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తోంది బెబో. ఇన్నేళ్లలో ఎప్పుడూ రిహార్సల్‌ అనే అవసరమే లేకుండా స్పాంటేనియస్‌ గా నటించినా ఇది చాలా ప్రత్యేకమైనదని బెబో చెబుతోంది.