రీఎంట్రీకి ముందే హాట్ గ్లామర్

Wed Nov 15 2017 00:23:13 GMT+0530 (IST)

హీరోయిన్స్ కి పెళ్లి అయిందంటే చాలు ఇక వారి కెరీర్ దాదాపు క్లోజ్ అయినట్టే అనుకుంటారంతా. మ్యారేజ్ తర్వాత స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా అంతగా ఆదరణ దక్కదేమో అనే టాక్ బాగా ఉంది. కానీ ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు అలా లేవు. అందం అనే విలువని కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తున్నారు పెళ్లైన భామలు. అంతే కాకుండా గ్లామర్ లో లిమిట్స్ పెట్టుకోకుండా సెక్సీ డ్రెస్సుల్లో దర్శనం ఇచ్చేస్తున్నారు కూడా.నాలుగు పదుల వయసొచ్చిన సీనియర్ బాలీవుడ్ తారలు కూడా బికినిలో దర్శనం ఇస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ లో మొన్నటి వరకు టాప్ హీరోయిన్ గా కొనసాగిన కరీనా కపూర్ ఖాన్ కూడా పెళ్లి తర్వాత అందంలో హాట్ నెస్ ని స్వీట్ గా చూపిస్తోంది. అమ్మడు సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినీ ఫీల్డ్ ని కొంచెం దూరం పెట్టింది. కానీ బాబుకు జన్మనిచ్చిన తర్వాత కరీనా కొంచెం బ్రేక్ తీసుకొని మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. వీరే ది వెడ్డింగ్ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక కరీనా కొన్ని వాణిజ్య ప్రకటనల్లో కూడా కనిపిస్తోంది. ఇక రీసెంట్ గా లక్స్ రోజ్ అవార్డ్స్ కోసం ఇచ్చిన ఒక స్టిల్ లో.. ఫ్యాషన్ డ్రెస్ తో హాట్ గా కనిపించింది. ఎంత హాట్ గా ఉన్నా కూడా అమ్మడు నెగిటివ్ కామెంట్స్ అస్సలు అందుకోవడం లేదు. ఇలా కరీనాను చూసిన ఎవరికీ నెగిటివ్ కామెంట్స్ చేయడానికి మనసు ఒప్పుకోదులే.