అల్ర్టా మోడ్రన్ అందాలకు 6 కోట్లు

Fri Apr 21 2017 11:12:18 GMT+0530 (IST)

కరీనా కపూర్ ఖాన్.. హింది పరిశ్రమ లో  టాప్ హీరోయిన్ గా ఉంది.. ఉంటుంది. కపూర్ అమ్మడు క్రేజ్ అసలు తగ్గితే ఒట్టు. ఈ సుందరి ప్రేమ విషయం అయినా.. పెళ్లి గురించి అయినా.. రూముర్స్ అయినా.. ఫ్యాషన్ అయినా.. ఈమే తరువాతనే ఎవరైనా కూడా. తన అందం - నటన - సోషల్ స్టేటస్.. అన్నీ ఈ ముద్ధు గుమ్మ కి కలిసివచ్చాయనే చెప్పాలి. బాలీవుడ్ లో తిరిగు లేని ఫ్యాన్ బేస్ ను తెచ్చిపెట్టింది.

సైఫ్ అలీ ఖాన్ పెళ్లి తో ఖాన్ ఖాంధన్ లో కోడలిగా అడుగు పెట్టి మరింత పాపులార్టీ సంపాదించింది అమ్మడు. ఈ మధ్య తన గర్భంతో ఉన్నపుడు కూడా అమ్ముడు ఎక్కడికి వెళ్ళితే అక్కడ హంగామా చేసేది. అదీ మరి బెబో మాయ. పెళ్లి తరవాత కూడా ఏమి తగ్గలేదు.. అదే రెచ్చిపోవడం.. పిచ్చెత్తించడం అనుకుంటే.. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆ జోష్ కంటిన్యూ చేసింది. ఇప్పుడు ఒక పిల్లాడిని కన్న తరువాత కూడా.. మళ్ళీ తిరిగి సినిమాల్లోకి వెంటనే వచ్చేస్తానంటోంది.

అలా వెయిటింగ్ చేస్తున్న అమ్మడుకి ఒక ఆఫర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కరీనా చేయబోతున్న మూవీ కి ఏకంగా ఆరు కోట్లు ఆఫర్ చేశారు ప్రొడ్యూసర్లు. 36 ఏళ్ల ఈ బార్బీ డాల్ సుందరి ఇప్పుడు 'వీర్ ది వెడ్డింగ్' అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా ను ఏక్తా కపూర్ మరియు రియా కపూర్ నిర్మిస్తున్నారు. అల్ట్రా మోడరన్ వొమెన్ రోల్ లో మెరవడానికి.. కరీనా వీరి దగ్గర ఒక ఆరు బాదేసింది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/