Begin typing your search above and press return to search.

అగ్గి రాజేస్తున్న స్టార్ డాట‌ర్ ఎఫైర్

By:  Tupaki Desk   |   20 Feb 2019 2:30 AM GMT
అగ్గి రాజేస్తున్న స్టార్ డాట‌ర్ ఎఫైర్
X
కెరీర్ ప్రారంభించి ఏడాది అయినా కాలేదు. అప్పుడే ఎఫైర్ వార్త‌ల్లో బెబో, పీసీల్నే మించిపోతోంది సారా అలీఖాన్. ఏ ఇత‌ర స్టార్ హీరోయిన్ త‌న‌కు సాటి కాలేర‌ని, త‌న‌కి తానే సాటి అని నిరూపిస్తోంది. సైఫ్ అలీఖాన్ - అమృత‌ల గారాల ప‌ట్టీ సారాకి ఇప్ప‌టికే స‌వ‌తి త‌ల్లి క‌రీనా నుంచి వార్నింగులు అంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అస‌లింత‌కీ సారా ఎవ‌రిని ప్రేమిస్తోంది? అంటే.. త‌న కోస్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో నిండా ప్రేమ‌లో మునిగి తేల్తోందిట‌. ఈ ఛామింగ్ గ‌య్ తో క‌లిసి `కేదార్ నాథ్` లాంటి ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టించింది సారా. ఆ సినిమా సెట్స్ లో ఉన్న‌ప్పుడే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం పెరిగింద‌ని, ఎఫైర్ జోరుగా సాగుతోంద‌ని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ల‌వ్వాయ‌ణానికి ప్రూఫ్ ఇటీవ‌ల దొరికేసింది. సుశాంత్ సింగ్ బ‌ర్త్ డే వేడుక‌ల కోసం మిడ్ నైట్ సారా ఏకంగా అత‌డి ఇంటివ‌ద్ద‌నే దిగిపోవ‌డం.. అక్క‌డ త‌న‌తో క‌ట్ చేయించ‌డం వంటి హంగామా మీడియా కంట ప‌డింది. త‌న బోయ్‌ఫ్రెండ్ సుశాంత్ కోసం సారా ఏకంగా డెహ్రాడూన్ నుంచి వ‌చ్చింది. మిడ్ నైట్ లో డిన్న‌ర్ డేట్ ని ఎంజాయ్ చేసింది. ఆ మొత్తం ఎపిసోడ్స్ మీడియా కంట ప‌డ‌డంతో నానా రాద్ధాంతం జ‌రిగి అది కాస్తా క‌రీనా చెవిన ప‌డిందిట‌. ఆ త‌ర్వాత సారాని పిలిచి సైఫ్ - క‌రీనా జంట ఫుల్ గా క్లాస్ తీస్కున్నార‌ట‌.

ఎఫైర్లు కాదు.. కెరీర్ ముఖ్యం! అంటూ క్లాస్ తీసుకున్నార‌ని తెలుస్తోంది. సారా కెరీర్ ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా టేకాఫ్ అయ్యింది. న‌టించిన తొలి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యాలు అందుకున్నాయి. తొలి సినిమా `కేదార్ నాథ్` త‌ర్వాత ర‌ణ‌వీర్ సింగ్ స‌ర‌స‌న బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `సింబా` లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చాక్లెట్ బోయ్ వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న సారా న‌టిస్తోంది. సారా గ్రాఫ్ అంతా పెద్ద స్థాయి హీరోల‌తోనే ఉంది కాబ‌ట్టి కెరీర్ ప‌రంగా చూసుకునే ప‌నే లేదు. ఇక ఇటీవ‌లి కాలంలో ప్రియాంక చోప్రాపైనా.. పెళ్లికి ముందు క‌రీనాపైనా వ‌చ్చినంత ఘాటైన ఎఫైర్ వార్త‌లు సారాపై వ‌స్తుండ‌డం యువ‌త‌రంలో ఆస‌క్తి పెంచుతోంది.