సవతి కూతురుపై కరీనా కాన్ఫిడెన్స్

Mon Jul 17 2017 22:05:30 GMT+0530 (IST)

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన మొదటి భార్య అమృతా సింగ్ కు విడాకులు ఇచ్చాకే.. కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి.. అమృతా సింగ్ ను కరీనాకు సవతి అనడం అంత కరెక్ట్ కాకపోవచ్చు. కానీ మన వరుసల ప్రకారం అయితే మాత్రం.. ఇదే మాట ఉపయోగిస్తూ ఉంటామంతే. కాకపోతే మన దగ్గర ఉన్న మాదిరిగా సవతి పోరు టైపులో నార్త్ లో పెద్దగా కనిపించవనే చెప్పాలి.

ఈ విషయాన్ని ఇప్పుడు కరీనా కపూర్ ఖాన్ ప్రూవ్ చేసేసింది. భర్త సైఫ్ అలీ ఖాన్.. అతని మొదటి భార్య అమృతా సింగ్ కూతురు అయిన సారా అలీ ఖాన్ పై బోలెడంత ప్రేమ కురిపించేస్తోంది. సారా అలీ ఖాన్ సినీ రంగ ప్రవేశంపై ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్స్ జరిగిపోతున్నాయి. ఇప్పటికే సైఫ్.. అమృతాలు కూడా తమ ఉద్దేశ్యాలను చెప్పేశారు. ఇప్పుడు సవతి తల్లి లేదా పిన్ని హోదాలో ఉన్న కరీనా కపూర్ కూడా సారా సినిమా రంగ ప్రవేశంపై రియాక్ట్ అయింది. తను ఎంతో ప్రతిభావంతురాలని చెప్పడమే కాదు.. మంచి భవిష్యత్తు కూడా ఆమెకు ఉందని అంటోంది కరీనా.

'తను ఎంతో ట్యాలెంటెడ్ అనే విషయం త్వరలోనే ప్రపంచానికి తెలుస్తోంది. అంతే కాదు.. సారా మేథావి కూడా. అందంగా కనిపించడమే కాదు. తనపై తనకు ఉన్న నమ్మకాన్ని ప్రశంసించాలి. అందం.. ప్రతిభ రెండూ ఉన్న తను.. పరిశ్రమను షేక్ చేసేయడం ఖాయం' అంటోంది కరీనా కపూర్. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో కేదార్నాథ్ మూవీ ద్వారా సారా అలీ ఖాన్ సినీ అరంగేట్రం చేయనుంది.