Begin typing your search above and press return to search.

ఇదీ ఓ స్టార్‌ హీరోయిన్‌ జీవితం

By:  Tupaki Desk   |   29 Aug 2015 7:16 AM GMT
ఇదీ ఓ స్టార్‌ హీరోయిన్‌ జీవితం
X
హృతిక్‌ సరసన కహోనా ప్యార్‌ హై చిత్రంలో నటించాల్సింది. కానీ బెబో కరీన అభిషేక్‌ బచ్చన్‌ సరసన 'రెఫ్యూజీ'లో నటించింది. అదే తనకి తొలిసినిమా. హృతిక్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొడితే, అభిషేక్‌ సినిమా అట్టర్‌ ఫ్లాపైంది. అయితే ఈ ఫలితం బెబో జీవితాన్ని తలకిందులు చేయలేదు. దాదాపు 15ఏళ్ల కెరీర్‌ సాగించింది. కెరీర్‌ లో పీక్స్‌ చూసింది. టాప్‌ 1 హీరోయిన్‌ గా నీరాజనాలు అందుకుంది. ఇప్పటికీ కెరీర్‌ పరంగా ఢోకా లేని హీరోయిన్‌ గా కొనసాగుతోంది.

బెబో ఇప్పటికే ఇద్దరు హీరోలతో ఎఫైర్‌ సాగించిందన్న వార్తలున్నాయి. కెరీర్‌ ఆరంభమే హృతిక్‌ రోషన్‌ తో ఎఫైర్‌ సాగించిందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కుర్రహీరో షాహిద్‌ కపూర్‌ తో చాలా కాలం ఎఫైర్‌ సాగించింది. ఆ క్రమంలోనే షాహిద్‌ వేరే భామతో ప్రేమాయణం నడిపించడంతో బెబో మనసు విరిగిపోయి ప్రేమలకు దూరంగా ఉండిపోయింది. కాలక్రమంలోనే సీనియర్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ శాశ్వతబంధంగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని సంసార జీవనాన్ని సాగిస్తున్నారు. ఇప్పుడు తన వయసు 34. రెఫ్యూజీ లో కనిపించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అయితే ఈ గ్లామర్‌ సీక్రెట్‌ కూడా బెబో చెప్పింది.. నిత్యం సూర్య నమస్కారాలు చేయడమే. 50 సూర్య నమస్కారాలు ఏకధాటిగా చేసేస్తుంది.. అదీ టాప్‌ సీక్రెట్‌.

అసలు కరీనాకి ఆ పేరెలా వచ్చింది? అని అడిగితే కరీనా తల్లి బబితాకపూర్‌ గర్భిణిగా ఉన్నప్పుడు 'అన్నా కరెనినా' అనే నవల చదివారు. అందులో నాయిక పేరు కరెనినా. ఆ పేరునే కూతురికి పెట్టేసుకుంది. అలా కరీన పేరు పెట్టారన్నమాట. ఇంట్లో అంతా బెబో అని పిలుస్తారు కాబట్టి అదే పేరు సెట్స్‌ లోనూ అలవాటై చివరికి బెబో కరీనగా పాపులర్‌ అయ్యిందన్నమాట!