రేడియోలో ఇలాంటి ప్రశ్న అడుగుతావా సైఫ్?

Tue Feb 12 2019 14:52:44 GMT+0530 (IST)

గతంతో పోలిస్తే సెలబ్రిటీల ముచ్చట్లు బయటకు వస్తున్నాయి. పెరిగిన మాధ్యమాలు.. సోషల్ మీడియా పుణ్యమా అని వారికి సంబంధించిన పలు విషయాల్ని సాధారణ ప్రజానీకం తెలుసుకునే పరిస్థితి. తాజాగా అలాంటి ఆసక్తికర అంశం ఒకటి తెర మీదకు వచ్చింది. బాలీవుడ్ నటి.. సైఫ్ సతీమణి కరీనా కపూర్ ప్రస్తతుం ఇష్క్ ఎఫ్ ఎం అనే రేడియోలో ఆర్జేగా వ్యవహరిస్తున్నారు.వాట్ వుమెన్ వాంట్ అనే కార్యక్రమంలో ఆమె ఆర్జేగా వ్యవహరిస్తూ.. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ నటుడు.. కరీనా భర్త ఆమెకు ఫోన్ కాల్ చేశారు.పిల్లలు పుట్టాక ఒకరికోసం ఒకరికి సమయం ఉండదని అంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు భార్య దృష్టిని మావైపునకు ఎలా తిప్పుకోవాలి? అంటూ ప్రశ్నించారు.

ఇలాంటి ప్రశ్నను ఊహించని కరీనా బదులిస్తూ.. ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా రేడియోలో అడుగుతారా సైఫ్ అంటూ ప్రశ్నించిన ఆమె.. నువ్వు అడుగుతున్నావు కాబట్టి సమాధానం చెబుతానంటూ.. "భర్త ఎప్పుడూ భార్య కోసం సమయం కేటాయించాలి. పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు ఎటూ పెరుగుతాయి. ఆ బాధ్యతల్ని భార్యభర్తలు ఇద్దరు సమానంగా పంచుకోవాలి. అప్పుడు భార్య సంతోషంగా ఉంటుంది. ఆమె దృష్టిని మీ వైపు తిప్పుకోవాలంటే మాత్రం ఆమెను ఒక అందమైన ప్లేస్ కు తీసుకెల్లండి. ఒకవేళ పిల్లలతో సమయం గడపాలని ఉందని చెబితే.. చిన్నబుచ్చుకోకుండి. దానర్తం ఆమెకు మీ పైన ప్రేమ తక్కువ అని కాదు" అంటూ బదులిచ్చింది.

ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోలేదు. తాను చెప్పిన సమాధానాన్ని గుర్తు చేస్తూ.. ఏమైనా.. త్వరలోనే నువ్వు నన్నో అందమైన ప్రదేశానికి తీసుకెళతావని అనుకుంటున్నానని చెప్పింది. మరి.. సైఫ్ ఎక్కడికి ప్లాన్ చేస్తారో..?