Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరిః అందం అదరహో

By:  Tupaki Desk   |   23 May 2018 5:01 AM GMT
ఫోటో స్టోరిః అందం అదరహో
X
ఎవరన్నారు పెళ్లయితే హీరోయిన్లు గ్లామర్ ఫీల్డ్ కు సెట్ అవరని.. ఎవరన్నారు పిల్లలు పుట్టాక గ్లామర్ రోల్స్ లో మెప్పించలేరని.. ఎవరన్నారు వయసు పెరిగితే సొగసు తగ్గిపోతుందని.. ఇకపై ఎవరన్నా ఈ మాట అంటే ఒప్పుకునేదే లేదు. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ను చూశాక ఈ ఒపీనియన్ మార్చుకోవాల్సిందే.

కెరీర్ లో టాప్ పొజిషన్ లో ఉండగానే బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ ను పెళ్లి చేసుకుంది కరీనా కపూర్. కొడుకు తైమూర్ కు జన్మనిచ్చాక కాస్తంత గ్యాప్ తీసుకుని మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చింది. సోనమ్ కపూర్ - స్వర భాస్కర్ తో కలిసి వీరే ది వెడ్డింగ్ సినిమాలో నటించింది. ఇందులో కరీనాది గ్లామర్ రోలే. ఆ పాత్రలో ఎంత రెచ్చిపోయి నటించిందీ ట్రయిలర్ లో చూపించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన కరీనా ఎంత గ్లామరస్ గా వచ్చింది అంటే ఆమె ముందు కొత్త హీరోయిన్లు గ్యారంటీగా తేలిపోతారు. బ్లాక్ టాప్ అండ్ బ్లాక్ డిజైనర్ మిడ్డీతో వచ్చి మెరుపులు మెరిపించింది. దీనికితోడు క్లీవేజ్ సోకులు మొత్తం చూపిస్తూ వయ్యారంగా నడిచొస్తుంటే కరీనా అందం అదరహో అనిపించక మానదు.

పెళ్లయిపోయి కొడుకు కూడా పుట్టేశాడు కాబట్టి గ్లామర్ రోల్స్ కు పనికిరాదేమో అనే వారంతా నోరెళ్లబెట్టి చూసేలా ఈ ప్రమోషన్ ఈవెంట్లో కరీనా వేడి పుట్టించింది. ఈమధ్య కాలంలో ఆమె ఈ రేంజి సెక్సీ లుక్స్ లో కనిపించింది ఇదే. అందులోనూ పబ్లిక్ ఈవెంట్లో ఈ రేంజిలో రచ్చ చేయడమంటే కరీనాకే చెల్లింది. కరీనా.. మొత్తానికి కేక పెట్టించావుగా.