Begin typing your search above and press return to search.

కరీనా ఏం మాయ నేర్చుకుందో

By:  Tupaki Desk   |   13 Jan 2018 11:12 AM GMT
కరీనా ఏం మాయ నేర్చుకుందో
X
బాలీవుడ్ లో ఎంత మంది అందమైన బ్యూటీలు ఎంట్రీ ఇచ్చినా కూడా కొందరు ఏ మాత్రం ఫెడవుట్ అవ్వడం లేదు. సాధారణంగా ఈ రోజుల్లో సీనియర్ హీరోయిన్స్ అయితే నిజంగా ఎదో మయా నేర్చుకున్నారెమో అనిపిస్తోంది. ఎందుకంటే వయసు ఎంత పెరుగుతున్నా కూడా ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్స్ ముక్కున వేలేసుకునేలా కనిపిస్తున్నారు. అంతే కాకుండా కొంచెం ఈర్షను కూడా తెప్పిస్తున్నారు.

అలాంటి చర్యలు కలిగించే హీరోయిన్స్ లలో ఇప్పుడు బెబో కూడా ఉంది. కరీనా కపూర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి అందంలో నెగిటివ్ టాక్ అస్సలు తెచ్చుకోలేదు. కళ్లతోనే ఆమె అభిమానులకు నిద్రలేకుండా చేస్తుంది. పెళ్లైన తరువాత కూడా కరీనా ఏ మాత్రం మారలేదు. అంతే కాకుండా ఒక బిడ్డకు జన్మనిచ్చిన రెండు నెలలకే మళ్లీ ఫ్యాషన్ వరల్డ్ లోకి అడుగు పెట్టింది. అప్పుడపుడు ఆమె ఇస్తున్న ఫొటో షూట్ లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా ఇచ్చిన ఒక స్టిల్ లో కూడా కరీనా వర్ణించలేని విధమైన అందంతో కనిపించింది. హాఫ్ షోల్డర్ బ్లాక్ డ్రెస్ లో అమ్మడి అందం గురించి ఎంత పొగిడినా తక్కువే. ఆమెను చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కరీనా ప్రస్తుతం వీరే ది వెడ్డింగ్ అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా 2018 సమ్మర్ తరువాత రిలీజ్ కానుంది.