Begin typing your search above and press return to search.

ఇంతలో ఎంత మారావ్ కరీనా

By:  Tupaki Desk   |   18 Nov 2017 5:56 AM GMT
ఇంతలో ఎంత మారావ్ కరీనా
X
అందాలు భామలు ఏం చేసినా వారికే చెల్లుతుంది. ఇలా సినిమాల్లోంచి మాయమైపోగానే అలా లావయిపోవడం.. మళ్లీ అవకాశాలు చేతికి అందగానే నాజూగ్గా మెరిసిపోవడం లాంటి విచిత్రాలు గతంలో చాలానే చూశాం. అయితే.. ఇప్పటివరకూ ఓ లెక్క అయితే.. కరీనా కపూర్ నుంచి మరో లెక్క నేర్చుకోక తప్పదు.

అసలు బాలీవుడ్ కి జీరో సైజ్ అందాలను పరిచయం చేసిన అద్భుతమైన సుందరాంగి కరీనా. సైఫ్ తో పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తున్న ఈ బ్యూటీ.. గతేడాది తాయ్ మూర్ కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టేందుకు కొన్ని వారాల ముందు వరకూ గ్లామర్ షోలలో యాక్టివ్ గానే పాల్గొంది అందాల బెబో. గతేడాది లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ సందర్భంగా నిండు గర్భిణిగా కూడా ఈవెంట్ లో పాల్గొన్న ఈ భామ.. నిండుగా చూడముచ్చటగా అలరించింది. మళ్లీ ఈ ఏడాది కూడా లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ ఈవెంట్ హంగామా మొదలైపోయింది. మరోసారి కరీనా సందడి కూడా బిగిన్ అయిపోయింది.

కానీ కరీనా కపూర్ లేటెస్ట్ లుక్స్ చూస్తే ఎవరైనా షాక్ తినేయాల్సిందే. బిడ్డ పుట్టిన ఏడాది సమయంలోనే ఓ మహిళలో ఇంతగా మార్పు అంటే వేరెవరికీ సాధ్యం కాని ఫీట్ అని చెప్పచ్చు. గర్భం దాల్చక మునుపే కాదు.. అసలు పెళ్లి కాక ముందు ఎలా ఉందో.. దాదాపుగా అదే లుక్ లోకి వచ్చేసి.. లేటెస్ట్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తోంది కరీనా. ఇలా ఈమెను చూసిన తర్వాత ఇంతలో అంతలా ఎలా మారావ్ కరీనా.. ఆ సీక్రెట్ ఏంటో చెప్పవూ అని ఎవరైనా ప్రాథేయపడాల్సిందే.