Begin typing your search above and press return to search.

పోటీ తట్టుకోలేక ఈ డోస్‌ ఇచ్చిందా?

By:  Tupaki Desk   |   1 Sep 2015 6:05 PM GMT
పోటీ తట్టుకోలేక ఈ డోస్‌ ఇచ్చిందా?
X
ముంబైలో జరుగుతున్న లాక్ మే ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫైనల్స్‌ కు చేరుకుంది. ఫైనల్స్‌ లో ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన బ్లాక్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని బాలీవుడ్ బ్యూటీ తార కరీనాకపూర్ ర్యాంప్‌ పై వయ్యారాలు వొలకబోసింది. ఫ్యాషన్ లో బెబో అందాల ప్రదర్శన రెట్టింపైంది. ఇంతగా అందాలను ఆరబోస్తూ... కరీనా కపూర్‌ కనిపించడం ఈ మధ్యకాలంలో ఇదే. సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచీ... స్కిన్ షోకి దూరంగా ఉంటోంది.

పెళ్లి తర్వాత ఎక్స్ పోజింగ్ విషయంలో స్పీడ్ బాగా తగ్గించింది. సినిమాలు కంటిన్యూ చేస్తున్నా.. అవన్నీ పెర్ఫామెన్స్ బేస్డ్ కేరక్టర్స్ మాత్రమే ఉంటున్నాయి. అసలు అమ్మడి కెరీర్ అందలం ఎక్కిందే మితిమీరిన అందాల డోస్ కారణంగా. కానీ పెళ్లి చేసుకుని పద్ధతైన కేరక్టర్ లకు పరిమితం కావడంతో... బెబో అభిమానులు కొంతకాలంగా బావురుమంటున్నారు. ఇన్నాళ్లకు మళ్లీ ఫ్యాషన్ వీక్ లో పాత కరీనాను చూసే ఛాన్స్ వచ్చిందని సంబరరడ్తున్నారు. అయితే... మూవీ ఛాన్సులు కంటిన్యూగానే ఉంటున్నా... స్పీడ్ మాత్రం బాగా తగ్గింది.

పెద్ద ప్రాజెక్టులను దక్కించుకోవడంలో వెనకబడింది. ఇలాగా మరికొన్నాళ్లు గడిస్తే... ఛాన్సులకు కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని భావించినట్లుంది బెబో. దీనికితోడు స్టార్ స్టేటస్ కోసం హీరోయిన్ల మధ్య ఎన్నడూలేనంత ఇప్పుడు బాలీవుడ్ లో ఉంది. దీంతో మళ్లీ గ్లామర్ ని బయటకు తీయక తప్పలేదు కరీనాకి. చూద్దాం ఈ ఛేంజ్ కేవలం ఫ్యాషన్ షోలకే పరిమితం అవుతుందో... లేక సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తుందో.. అన్నట్లు ఒక్క లిప్ లాక్ తప్ప ఏం చేసినా పర్లేదంటూ సైఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బెబోకి.